అర్ధరాత్రి హోటల్‌పై దాడి... రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు...
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో రేవ్ పార్టీని పోలీసులు బట్టబయలు చేశారు. శనివారం అర్ధరాత్రి ఆ హోటల్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హోటల్‌పై దాడి చేసి నిర్వాహకులతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉండగా...ఓ ఉక్రెయిన్ యువతి కూడా ఉన్నట్లు సమాచారం.
బిజినెస్ కార్యకలాపాల పేరుతో హోటల్లో రూమ్ బుక్ చేసుకుని రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. గతంలో జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తే... ఈ హోటల్లోనూ రేవ్ పార్టీకి ఏర్పాట్లు చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి రాత్రివేళ పార్టీ చేసుకున్నందుకు... సంబంధిత సెక్షన్లతో కేసులు పెట్టినట్లు సమాచారం.

ఈ ఏడాది జనవరిలో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫార్మా కంపెనీ తమ సేల్స్ పెంచుకునేందుకు.. డాక్టర్లు, ఉద్యోగుల కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అర్ధనగ్న నృత్యాలు,వ్యభిచారం కోసం వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించినట్లు గుర్తించారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications