హమ్మయ్యా.. భర్తతోనే వెళ్లిన వివాహిత.. విడాకులకు దరఖాస్తు చేయడంతో..

వికారాబాద్‌లో కలకలం రేపిన మహిళ కిడ్నాప్ కేసు ఉత్కంఠ వీడింది. భర్తతో కలిసి వెళ్లానని ఆమె చెప్పడంతో పేరంట్స్ సహా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె భర్తతో విడాకుల కేసు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తన ఇష్టంతోనే భర్తతో కలిసి వెళ్లానని చెప్పడం కాస్త అనుమానాలకు తావిస్తోంది. కానీ ఆమె తిరిగి రావడంతో పేరంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు.

వికారాబాద్ యువతి కిడ్నాప్ కేసు ఉత్కంఠకు తెరపడింది. భర్తతో కలిసి ఉండేందుకే ఆమె వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఖలీల్ అలియాస్ అఖిల్‌ను దీపిక ప్రేమించింది. నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా అతనిని దీపిక పెళ్లి చేసుకుంది. పెళ్లి ఇష్టంలేని తల్లిదండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. విడిపోవాలని విడాకులకు దరఖాస్తు చేయించారు.

police chased vikarabad wom

విడాకులకు సంబంధించి కేసు విచారణలో ఉంది. అయితే ఆమె సడెన్‌గా కనిపించకుండా పోయింది. ఈ నెల 27న సాయంత్రం ఎమ్మార్పీ చౌరస్తాకు వెళ్లింది. ఇక అప్పటినుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో దీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు.

Recommended Video

    Kapil Dev Meets KTR In Hyderabad || Oneindia Telugu

    తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని దీపిక తెలిపింది. తానే భర్తతో కలిసి కారులో వెళ్లినట్టు దీపిక పేర్కొంది. దీనికి సంబంధించి కోర్టులో దీపిక చెప్పే దానిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కానీ బలవంతంగా విడాకులకు ఆప్లై చేయడంతో దీపికి వెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిజ నిజాలు విచారణలో తెలియనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+