వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిటీలో కాలుష్య నియంత్రణ..! డీజిల్ వాహనాలకు చెక్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏటా పెరుగుతున్న కాలుష్య కారకాల సంఖ్యను తగ్గించేందుకు పలు సంస్థలు డీజిల్ వాహనాలకు చెక్ పెట్టే దిశగా సాగుతున్నాయి. దీంతో డీజిల్ వాహనాలు తీసుకున్న వారిలో కందరగోళం నెలకొంది. కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళన కూడా డీజిల్‌ ఇంజిన్లకు స్వస్తి పలికేందుకు కారణమైంది. పెట్రోల్ వాహనాలకంటే డీజిల్ వాహనాల ద్వారా కాలుష్యం రెట్టింపు అవుతున్న నేపథ్యంలో ఆ వాహనాలను నియంత్రించేందకు అదికారులు నడుంబిగిస్తున్నట్టు తెలుస్తోంది.

 డీజిల్ వాహనాలు బంద్..! కాలుష్యం నివారించడమే లక్ష్యం..!!

డీజిల్ వాహనాలు బంద్..! కాలుష్యం నివారించడమే లక్ష్యం..!!

ప్రపంచ వ్యాప్తంగా 3,000 పట్టణాల్లో గ్రీన్‌ పీస్‌ అండ్‌ ఎయిర్‌ విజువల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తొలి 30 అత్యంత కాలుష్య పట్టణాల్లో 22 భారత్‌లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దిల్లీలో కాలుష్యాన్ని అడ్డుకొనేందుకు అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగడం డీజిల్‌ కార్ల డిమాండ్‌ పై ప్రభావం చూపింది.

 డీజిల్ వాహనాలపై ఆంక్షలు..! పెట్రోల్, విద్యుత్ కార్లకు పెరగనున్న గిరాకీ..!!

డీజిల్ వాహనాలపై ఆంక్షలు..! పెట్రోల్, విద్యుత్ కార్లకు పెరగనున్న గిరాకీ..!!

దీంతో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలపై నిబంధనలు విధించింది. దీంతో పెట్రోల్, విద్యుత్ వాహనాలు మార్కెట్లను భవిష్యత్ లో భారీగా పెరగనున్నట్టు సమాచారం. ప్రభుత్వం కూడా దేశంలో విద్యుత్తు, సీఎన్‌జీ వాహనాల తయారీని ప్రొత్సహించే వాతారణాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొంది.

డీజిల్ ఇంజన్లపై నిఘా..! కనుమరుగయ్యే అవకాశం..!!

డీజిల్ ఇంజన్లపై నిఘా..! కనుమరుగయ్యే అవకాశం..!!

దీనిలో భాగంగా 2030 నాటికి 10వేల సీఎన్‌జీ పంపులను ప్రారంభించనుంది. దీంతోపాటు ఎల్‌ఎన్‌జీ ఆధారిత వాహనాలను ప్రోత్సహించనుంది. మరోపక్క ఫోక్స్‌ వ్యాగన్‌ వాహనాల కేసు తర్వాత డీజిల్‌ ఇంజిన్లపై నిఘా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిబంధనల అమల్లో ఏమాత్రం తేడా వచ్చినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

 పర్యావరణ పరిరక్షణే ద్యేయం..! కొరడా ఝుళిపించనున్న యంత్రాంగం..!!

పర్యావరణ పరిరక్షణే ద్యేయం..! కొరడా ఝుళిపించనున్న యంత్రాంగం..!!

దీంతో కంపెనీలు కూడా డీజిల్‌ ఇంజిన్ల వైపు మొగ్గు చూపడంలేదు. 2020 తర్వాత నుంచి డీజిల్‌ ఇంజిన్లకు గిరాకీ తగ్గుతుందని బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ ఏజెన్సీ ఫైనాన్స్‌ ఒక సర్వేలో పేర్కొంది. అదే సమయంలో విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పెరగనుంది. ఎటువంటి రాయితీలు లేకుండా మిగిలిన కార్లతో పోటీపడే స్థాయి 2024 వరకు భారత్ కు వస్తుందని కొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి.

English summary
Several firms are looking to check diesel vehicles to reduce the number of rising pollutants annually. This led to the turmoil in those who took diesel vehicles. The growing concern over pollution also caused diesel engines to end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X