Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి: ఎందుకంటే?

ఖమ్మం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి సందడి చేశారు. టీడీపీతోపాటు సీపీఐ, ప్రజాపంతా కార్యాలయాలకు వెళ్లి ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం సందర్శించిన సందర్భంగా పొంగులేటి మాట్లాడారు.

టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారని మంత్రి చెప్పారు. టీడీపీ కృషి మరువలేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పనిచేశారన్నారు. అహంకారపూరిత ప్రభుత్వాన్ని ఓడించేందుకు టీడీపీ కృషి మరువలేనిదన్నారు. తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

Ponguleti srinivasa reddy says thanks to chandrababu for supporting congress in recent assembly polls

కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ వేరువేరు కాదు.. భవిష్యత్‌లో అందరం కలిసి పనిచేద్దామని టీడీపీ నేతలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.

చిత్తశుద్ధితో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సీపీఐఎంఎల్, ప్రజా పంథా సహకరించాయన్నారు. వందకు వందశాతం అభయహస్తం ద్వారా ఆరు గ్యారంటీలు అమలుచేస్తామన్నారు. కాగా, ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మరోవైపు, అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా టీడీపీ కార్యాలయానికి చేరుకుని.. కార్యకర్తలతో మాట్లాడారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+