ఈ చీరలు దిష్టిబొమ్మలకు తప్ప పనికి రావు,హరీష్ రాజీనామా చేయాలి: పొన్నం
చీరల కొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గురువారం డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగకు చేనేత చీరలు ఇస్తామని ప్రచారం చేసి పాలిస్టర్ చీరలు ఇచ్చారని విమర్శించారు.
కరీంనగర్: చీరల కొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గురువారం డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగకు చేనేత చీరలు ఇస్తామని ప్రచారం చేసి పాలిస్టర్ చీరలు ఇచ్చారని విమర్శించారు.
ఈ చీరలు పంటపొలాల్లో పక్షులను బెదిరించేందుకు దిష్టిబొమ్మలకు కట్టడానికి తప్ప మహిళలు ధరించడానికి పనికి రావన్నారు.

కాళేశ్వరం సొరంగం పనుల్లో జరిగిన ప్రమాదానికి పనుల్లో నాణ్యత లోపించడమే కారణమన్నారు. ఇందుకు మంత్రి హరీశ్ రావు నైతిక బాధ్యత వహించి, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications