Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం: ఆత్మహత్యలో ట్విస్ట్‌లెన్నో, భార్య పేరు ఇలా..

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న నటుడు విజయ్ సాయి మృతదేహానికి మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాన్ని యూసఫ్‌గూడలోని ఆయన ఇంటికి తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా విజయ్ ఆత్మహత్యపై అనుమానాలు, కుటుంబ సభ్యుల పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది.

 విజయ్ సాయి ఆత్మహత్యలో ట్విస్టులు

విజయ్ సాయి ఆత్మహత్యలో ట్విస్టులు

విజయ్ సతీమణి వనిత పాస్ పోర్టులో ఒక పేరు ఉండగా, స్కూల్ సర్టిఫికేట్లో మరో పేరు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. వనిత అసలు పేరు వరలక్ష్మి. అంతేకాదు తండ్రి పేరు కూడా వేర్వేరుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే.

నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం

నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం

విజయ్ సాయి ఆత్మహత్యతతో ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన ఓ సెల్ఫీ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ిందులో పేర్కొన్న భార్య వనితకు, న్యాయవాదికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వనిత తల్లితో సహజీవనం చేసిన రఫీ అనే వ్యక్తికి ఆత్మహత్యతతో సంబంధం ఉందా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.

 ఎవరినీ వదిలి పెట్టవద్దని

ఎవరినీ వదిలి పెట్టవద్దని

భార్య వనిత ప్రవర్తన, ఇతరుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నానని విజయ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తన చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణమని ఆరోపించారు. వీరంతా తనను మానసికంగా హింసించారన్నారు. 'డాడీ.. ఎవ్వర్నీ విడిచిపెట్టొదు. అందరికి శిక్ష పడేలా చూడు.. లవ్‌ యూ డాడీ.. నా కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టంలేదు.. తీసుకొని రండి డాడీ' అని విజయ్‌ సాయి సెల్ఫీ వీడియోలో అన్నారు.

 వనిత వాదన ఇదీ

వనిత వాదన ఇదీ

మరోవైపు, వనిత మాత్రం తనకు ఏమీ తెలియదని చెబుతున్నారు. తన భర్త విజయ్‌సాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తనకు తెలియదని, విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉందని, ఆ విషయం నేను కళ్లారా చూశానని, అప్పటి నుంచే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని, ఈ విషయాన్ని ఆయన తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్తే వారు కూడా పట్టించుకోలేదని వాపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+