Bellampally: 'బై బై చిన్నయ్య.. గుడ్ బై చిన్నయ్య'.. బెల్లంపల్లిలో వెలిసిన పోస్టర్లు..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. 'బై బై చిన్నయ్య... గుడ్ బై చిన్నయ్య' అని పోస్టర్లపై రాసి ఉంది. బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గం పేరిట వెలిసిన ఈ పోస్టర్లలో ఎమ్మెల్యే చిన్నయ్య అవినీతి, అక్రమాలు, మహిళలపై వేధింపుల గురించి రాసుకొచ్చారు. ఇటీవల ఓ ప్రైవేట్ డెయిరీ విషయంలో ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి క్లిప్పింగ్లను పోస్టర్లలో ప్రింట్ చేశారు.
ఓ ఎమ్మెల్యే వలపు చేష్టలు.. అభివృద్ధి కోసం, అవినీతి, భూకబ్జాల అంతం కోసం, మహిళలపై వేధింపులకు చరమగీతం పాడడం కోసం బైబై చిన్నయ్య గుడ్ బై చిన్నయ్య అంటూ రాశారు. ఇక చాలు చిన్నయ్య.. సెలవు చిన్నయ్య, ఎమ్మెల్యే డర్టీ పిక్చర్.. ప్రజా ప్రతినిధిగా ప్రజాసేవ మరిచి మీకున్న బలహీనతతో బెల్లంపల్లి ప్రజల పరువు తీస్తివి.. బైబై చిన్నయ్య గుడ్ బై చిన్నయ్య అంటూ పోస్టర్లు వేయడంపై స్థానికంగా సంచలనంగా మారింది.

అప్పట్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే పై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. దుర్గం చిన్నయ్య తమను నమ్మించి మోసం చేశాడని చెప్పింది. తమ వద్ద డబ్బు తీసుకుని జైలు పంపించాడని ఆరోపించింది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. ఆమె ఒక వీడియోను కూడా విడుదల చేసింది.
డెయిరీ ఏర్పాటు చేయడానికి మొదటిసారిగా దుర్గం చిన్నయ్య వద్దకు వెళ్లామని ఆమె చెప్పింది. డెయిరీ ఏర్పాటు చేసుకోండి కానీ.. తమకు తెలిసిన వారికి వాటా ఇవ్వాలని కోరినట్లు వివరించింది. అలా చేస్తే తన మద్దతుతోపాటు ఏం కావాలన్న చేస్తామని ఎమ్మెల్యే చెప్పినట్లు పేర్కొంది.
ఎమ్మెల్యే ప్రతిపాదన ఒకే చెప్పి వారికి సంబంధించిన వారికి వాటా ఇచ్చామని చెప్పారు. రెండెకరాల భూమి కూడా ఇచ్చారని ఆమె తెలిపింది. బిజినెస్ గురించి చిన్నయ్యను కలవడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్లేవాళ్లమని చెప్పింది. ఈ క్రమంలో తమతో పాటు తమ కంపెనీలో పని చేసే అమ్మాయిని తీసుకెళ్లామని. ఆమెను చూసిన ఎమ్మెల్యే తన వద్ద పంపాలని కోరినట్లు యువతి పేర్కొంది.దానికి తాము ఒప్పుకోలేదని.. ఒత్తిడి పెరగడంతో చేసేది ఏమి లేక బ్రోకర్ నెంబర్లు తెలుసుకుని ఆయనకు పంపించామని చెప్పింది. యువతి ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications