పావురాన్ని కాపాడేందుకు మూడు జిల్లాల్లో 10 నిమిషాల పాటు విద్యుత్ నిలిపివేత

ఒక పావురాన్ని కాపాడటానికి మూడు జిల్లాలలో పదినిమిషాల పాటు కరెంటు నిలిపివేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హైదరాబాదులోని కేపీహెచ్బీ వద్ద హైటెన్షన్ విద్యుత్ లైన్ పై ప్రమాదకరంగా ఉన్న పావురాన్ని కాపాడడం కోసం మూడు జిల్లాల్లో మెజారిటీ ప్రాంతాలలో సోమవారం పది నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పావురం కోసం విద్యుత్ నిలిపివేసిన ట్రాన్స్ కో అధికారులు

పావురం కోసం విద్యుత్ నిలిపివేసిన ట్రాన్స్ కో అధికారులు


యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అభ్యర్థన మేరకు పావురాన్ని కాపాడడానికి రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి హైదరాబాద్లోని మెజారిటీ ప్రాంతాలలో టీఎస్ ట్రాన్స్ కో అధికారులు పావురాన్ని కాపాడటం కోసం విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ వారికి విద్యుత్ షాక్ తగలకుండా పావురాన్ని రక్షించటం సాధ్యమైంది.

కరెంట్ తీగకు దారంతో చిక్కుకున్న పావురం .. రంగంలోకి యానిమల్ సొసైటీ

కరెంట్ తీగకు దారంతో చిక్కుకున్న పావురం .. రంగంలోకి యానిమల్ సొసైటీ



ఇంతకీ ఏం జరిగిందంటే ఒక పావురం గాలిలో ఎగురుతూ వెళుతున్న క్రమంలో దాని కాలికి ఉన్న దారం విద్యుత్ తీగకు చిక్కుకోవడంతో పావురం అక్కడినుండి కదలలేకపోయింది. అక్కడే అది కిందికి వేలాడుతూ కనిపించింది. ఇక ఇది గమనించిన కొందరు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కి విషయం చేరవేశారు. దీనిని కాపాడడానికి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ బృందం రంగంలోకి దిగింది.

133 కెవి విద్యుత్ లైన్ కావటంతో ట్రాన్స్ కో అధికారులకు సంప్రదింపులు

133 కెవి విద్యుత్ లైన్ కావటంతో ట్రాన్స్ కో అధికారులకు సంప్రదింపులు

అయితే అది 133 కెవి విద్యుత్ లైన్ అయిన కారణంగా పావురాన్ని కాపాడే క్రమంలో, కాపాడడానికి వెళ్లిన బృందం ప్రమాదంలో పడతారని గుర్తించిన సొసైటీ సభ్యులు ట్రాన్స్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి ప్రభాకర్‌రావుతో సంప్రదింపులు జరిపారు. అయితే దీనిపై సీనియర్ అధికారుల మధ్య చర్చలు, సమావేశాల అనంతరం, పావురం కోసం మూడు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు.

విద్యుత్ నిలిపివెయ్యటంతో రెస్క్యూ చేసిన సొసైటీ

విద్యుత్ నిలిపివెయ్యటంతో రెస్క్యూ చేసిన సొసైటీ

ఆ తర్వాత ఎడబ్ల్యుసిఎస్ వారు పావురాన్ని కాపాడడానికి బూమ్ లిఫ్ట్‌ని ఉపయోగించి పక్షిని రక్షించారు. వాస్తవంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రక్రియకు కేవలం పది నిమిషాలే పట్టినప్పటికీ, హైటెన్షన్ విద్యుత్ వైర్లు కావడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసి మొత్తం బూమ్ లిఫ్ట్ తో పావురాన్ని కాపాడడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఏది ఏమైనా పావురం కోసం జరిగిన రెస్క్యూ, దానికి సహకరించిన ట్రాన్స్కో అధికారులు మూడు జిల్లాల్లో పదినిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ట్రాన్స్ కో అధికారుల చొరవతో పావురం కథ సుఖాంతం

ట్రాన్స్ కో అధికారుల చొరవతో పావురం కథ సుఖాంతం


మనుషుల కోసమే పట్టింపు లేని నేటి రోజుల్లో ఒక పావురం ప్రాణం కాపాడటం కోసం రంగంలోకి దిగిన యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ, వారికి సహకరించిన ట్రాన్స్ కో అధికార యంత్రాంగం అందరి మన్ననలు పొందుతుంది. ఒక పావురానికి ప్రాణం పోయటం కోసం చేసిన రిస్క్ కాస్త జనాలకు ఇబ్బంది కలిగించినా మొత్తానికి పావురం కథ సుఖాంతం అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+