వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం ..ప్రభాస్ పెద్దమ్మ సంచలనం
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా 'బహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్‌కు ఫిదా అయిపోయారు. 'సాహో' సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ అధికారం మనదే
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2025
కేటీఆర్‌తో హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి pic.twitter.com/bpmhcp8LTr
'రాధే శ్యామ్', ఆదిపురుష్' సినిమాలతో నిరాశ పరిచిన ప్రభాస్, 'సలార్', 'కల్కి' వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్-2','ఫాజీ', 'కల్కి-2' ,సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆయన నటిస్తూన్న 'రాజాసాబ్' సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి అయింది. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఓ ఫంక్షన్‌కు వెళ్లగా, అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కనిపించారు. కేటీఆర్‌తో అప్యాయంగా మాట్లాడిన శ్యామలా దేవి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయమంటూ కేటీఆర్‌ను దీవించారు. దానికి కేటీఆర్ థాంక్యూ అమ్మ అంటూ సమాధానం ఇవ్వడం కనిపించింది. దీంతో ప్రభాస్ ఫ్యామిలీ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications