Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నయీం ప్రధాన అనుచరుడి హత్యకు కుట్ర, ప్రదీఫ్‌రెడ్డి అరెస్ట్

భువనగిరి: గ్యాంగ్‌స్టర్‌ నయీం ముఖ్య అనుచరుడు కొనాపూరి శంకర్ హత్యకు కుట్ర పన్నిన కొనాపురి రాములు అనుచరులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కొనాపురి రాములు, ఆయన సోదరుడు సాంబశివుడు అలియాస్ అయిలయ్యను హత్య చేసినందుకు ప్రతీకారంగా ఈ హత్యకు కుట్రపన్నారని పోలీసులు ప్రకటించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీంకు, మావోయిస్టు పార్టీ నేత సాంబశివుడు కుటుంబానికి మధ్య వైరం ఇంకా కొనసాగుతోంది. సాంబశివుడు మావోయిస్టు పార్టీ నుండి జనజీవనస్రవంతిలో కలిశారు. అయితే టిఆర్ఎస్‌లో చేరిన కొంత కాలానికి 2014 ఎన్నికల ముందు సాంబశివుడిని ప్రత్యర్థులు చంపేశారు.

2014 ఎన్నికల ఫలితాలకు ముందు సాంబశివుడి సోదరుడు, టిఆర్ఎస్‌ నేత కొనాపురి రాములును నల్గొండలో ప్రత్యర్థులు హత్య చేశారు. అయితే గత ఏడాది షాద్‌నగర్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం మరణించాడు.

అయితే గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ విచారణ సాగిస్తోంది. అయితే ఈ నయీం ప్రధాన అనుచరుడు శేషయ్య ఇంకా పోలీసులకు చిక్కలేదు. శేషయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నయీం అనుచరుడి హత్యకు కుట్ర

నయీం అనుచరుడి హత్యకు కుట్ర

గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు కొనాపురి శంకర్‌ను హత్య చేసేందుకు మావోయిస్టు మాజీ నేత సాంబశివుడి సోదరుడు కొనపురి రాములు అనుచరుల కుట్రను రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో గ్యాంగ్‌ స్టర్‌ నయీమ్‌ ముఖ్యఅనుచరుడు, కొనపురి రాములు హత్య కేసులో ప్రధాన నిందితుడు కొనపురి శంకర్‌ను హత్య చేసేందుకు కొనపురి రాములు ముఖ్య అనుచరుడు కొమిరెల్లి ప్రదీ‌పరెడ్డి, అతడి అనుచరులను శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి స్కా ర్పియో వాహనం, డమ్మీ పిస్టల్‌, గొడ్డళ్లు, కత్తులతో పాటు పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకు న్నట్లు రాచకొండ భువనగిరి జోన్‌ డీసీపీ పా లకుర్తి యాదగిరి తెలిపారు.

కొనాపురి శంకర్‌తో సాంబశివుడి కుటుంబానికి విబేధాలు

కొనాపురి శంకర్‌తో సాంబశివుడి కుటుంబానికి విబేధాలు

యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మం డలం దాసిరెడ్డిగూడెంనకు చెందిన కొనపురి శంకర్‌ గ్యాంగ్‌స్టర్‌ నయీమోద్దీన్‌ ముఖ్య అనుచరుడు. ఇతడికి మాజీ మావోయిస్టు నేత కొనపురి సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు మధ్య పగలు, విద్వేషాలు ఉన్నాయి. దీంతో కొనపురి సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు హత్య కేసుల్లో కొనపురి శంకర్‌ ప్రధాన కుట్ర దారుడు. అయితే రాములు హత్య తర్వాత అతడి అనచరులు శంకర్‌ను హత్య చేసి ప్రతికారం తీర్చుకోవాలని కుట్ర పన్నారని పోలీసులు ప్రకటించారు.

శంకర్ హత్యకు ప్రదీప్‌రెడ్డి కుట్ర

శంకర్ హత్యకు ప్రదీప్‌రెడ్డి కుట్ర

కొనాపురి రాములు ప్రధాన అనుచరుడు కొమిరెల్లి ప్రదీ్‌పరెడ్డి, అతడి అనుచరులు కనకాల లింగస్వామి, దాసరి లావలేష్‌, దేవరపల్లి భూపాల్‌రెడ్డి, రాపోలు నాగభూషణం, పోగిల్లి వెంకన్న, జోగు కిరణ్‌, కర్నాటి రమే్‌షలతో కలిసి తమ ప్రత్యర్థి నయీం అనుచరుడైన కొనపురి శంకర్‌ను హత్య చేయాలని పథకం వేసుకున్నారని పోలీసులు ప్రకటించారు.

కొనాపురి రాములు అనుచరులు పట్టుబడ్డారిలా

కొనాపురి రాములు అనుచరులు పట్టుబడ్డారిలా

కొనాపురి శంకర్‌ను హత్య చేసేందుకు కొనాపురి రామలు అనుచరులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా స్కార్పియో వాహనంలో మారణాయుధాలతో సంచరి స్తుండగా, వలిగొండ మండలం గోల్నేపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. స్కార్పియో వాహ నంలో గొడ్డళ్లు, కత్తులు, డమ్మి పిస్తోల్‌, మాస్కులు, నాన్‌ చాక్‌, క్రికెట్‌ వికెట్‌ కర్రలను స్వాధీనం చేసుకుని వీరిని ప్రశ్నించగా, కొనపురి రాములు హత్య కేసులో ప్రధాన కుట్ర దారుడు కొనపురి శంకర్‌ను హత్య చేయడానికి కుట్ర వెల్లడైనట్లుగా డీసీపీ యాదగిరి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+