ప్రియదర్శి బైకు చోరీ.. సందీప్ కిషన్ సారీ: బైకుకు సందీప్‌కు ఏంటి సంబంధం..?

హైదరాబాదు: ఒక సినిమా తీయాలంటే బాగానే ఖర్చు చేస్తారు. మరి సినిమా తీసిన తర్వాత ఆ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తుంది ఆ చిత్ర యూనిట్. కొత్త పద్దతుల్లో సినిమాను ప్రమోట్ చేయాలని చూసి చిక్కులు కూడా వెంట తెచ్చుకుంటుంది. అలాంటి చిక్కులే తెచ్చుకున్నాడు యువ హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం నిను వీడని నీడను నేనే. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో కూడా ముందుంది. సందీప్ కిషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ప్రమోషన్‌లో మరింత జాగ్రత్త తీసుకున్నాడు. ఈ అతి జాగ్రత్తే అతన్ని బుక్ చేసేసింది. చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

ఇక అసలు విషయానికొస్తే... మల్లేషం చిత్ర నటుడు ప్రియదర్శి ఎంతో ఇష్టంగా కొన్న బైకును ఎవరో చోరీ చేశారు. చోరీ చేసే దృశ్యాలు కూడా తన ఇంటివద్దే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బైకు చోరీకి గురవ్వడాన్ని గమనించిన ప్రియదర్శి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ అవడంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతి ఆ దొంగ ఎలా మరిచాడంటూ ట్వీట్ చేశాడు. చాలా తెలివైన ధైర్యవంతుడైన దొంగై ఉంటాడని ప్రియదర్శి ట్వీట్ చేశారు. ప్రియ దర్శి బైకు దొంగతనంకు గురైతే సందీప్ కిషన్ సారీ చెప్పారు. అయితే ఆ బైకు చోరీ కావడానికి సందీప్ కిషన్‌కు సంబంధం ఏముంది అని చాలా మంది నెటిజెన్లు మదన పడ్డారు. అంతలోనే సందీప్ కిషన్ వివరణ ఇచ్చాడు.

Prank video lands tollywood hero Sandeep Kishan in trouble

ప్రియదర్శి బైకు చోరీ అవడం నెటిజెన్లు సీరియస్‌గా స్పందిస్తుండటం.. పోలీసులు రంగంలోకి దిగడంతో సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. అది తన చిత్రం నిను వీడని నీడను నేనే ప్రమోషన్‌లో భాగంగానే ప్రియదర్శి బైకును చోరీ చేయడం జరిగిందని చెప్పాడు. విషయం ఇంత సీరియస్‌ అవుతుందని తాను ఊహించలేకపోయినట్లు చెబుతూ క్షమాపణలు కోరాడు. ఇదొక ప్రాంక్ వీడియో అని చెప్పుకొచ్చాడు. తన చిత్రంలో నటించాల్సిందిగా ప్రియదర్శిని అడిగామని అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అతని బైకును చిత్రంలో వినియోగించినట్లు చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. ఇదిలా ఉంటే అసలు విషయం బయటకు రావడంతో ప్రియదర్శి చోరీ చేసిన వీడియోను ట్విటర్ నుంచి తొలిగించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+