పైకి డాక్టర్.. లోపల డ్రగ్స్ డీలర్.. ఇంటినే 'డ్రగ్స్ డెన్' గా మార్చి..
వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు.. ఆరోగ్యంపై మంచీ చెడు చెప్పాల్సిన వైద్యుడే డ్రగ్స్ విక్రయానికి పాల్పడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో డ్రగ్స్ డెన్ బయటపడింది. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్నేహితులతో కలిసి డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మకాలు చేస్తున్నట్లు తేల్చారు. ఈ మేరకు డాక్టర్ జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు. అతడి స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్ లపై కేసు నమోదు చేశారు.
ఓ వైపు సమాజంలో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుంటే హైదరాబాద్ నడి బొడ్డున ముషీరాబాద్ లో డ్రగ్స్ డెన్ బయటపడడం కలకలం రేపుతోంది. అది కూడా ఓ వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ విక్రయాలు వెలుగులోకి రావడంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముషీరాబాద్ కు చెందిన డాక్టర్ జాన్ పాల్.. తన అద్దె ఇంట్లోనే ఈ డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. తన స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్ లతో కలిసి ఈ డ్రగ్స్ డెన్ ప్రారంభించాడు. అయితే డాక్టర్ జాన్ పాల్.. ఇంట్లోనే డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో రైడ్ చేశారు.

డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి తెలిశాయి. జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ ను గుర్తించారు. ఓజీ కుష్, ఎండిఎంఎ, ఎల్ ఎస్ డీ బాస్ట్స్, కొకైన్, గుమ్మస్, హాసిస్ ఆయిల్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ పాల్ తన ఫ్రెండ్స్ తో కలిసి దిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో దాదాపు రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డాక్టర్ జాన్ పాల్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడి స్నేహితులు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications