అప్పుడు రైతు డిక్లరేషన్ .. ఇప్పుడు యూత్ డిక్లరేషన్; రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్ అవుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మొదటి నుంచి కేసీఆర్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు సహకరించినా, సహకరించకపోయినా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.
వివిధ డిక్లరేషన్ల పేరుతో అటు ప్రజా మద్దతును కూడగట్టడానికి, అటు అధిష్టానం వద్ద పట్టు సంపాదించడానికి కష్టపడుతున్నారు. గతంలో రైతాంగ సమస్యలపై రాహుల్ గాంధీని తెలంగాణాకు రప్పించి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. ముఖ్యంగా కీలకమైన ధరణి పోర్టల్ రద్దు చేస్తామని,ధరణి వల్ల ఇబ్బందిపడిన రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. రైతాంగ సమస్యలపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ రైతులను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇక తాజాగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ప్రధాన అంశంగా తీసుకొని యూత్ ని టార్గెట్ చేసి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. యువ సంఘర్షణ సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీని ఆహ్వానించి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు.నిరుద్యోగం లేని తెలంగాణ రాష్ట్రం కోసం పని చేస్తామని చెప్పారు. నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పలు హామీలను ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ యువతను ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి యువత మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రియాంకా గాంధీ తాము ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కు జవాబుదారీగా ఉంటామని, అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి చూపిస్తామని తన ప్రసంగంలో తెలిపారు.
మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ప్రధాన సమస్యలైన రైతాంగ సమస్యలను,నిరుద్యోగ సమస్యలను అస్త్రాలుగా తీసుకొని డిక్లరేషన్లు ప్రకటించి ప్రజల మద్దతును చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications