అప్పటి వరకు ప్రైవేటు కాలేజీలు తెరిచేది లేదు - తేల్చేసిన యాజమాన్యాలు..!!

రాష్ట్రంలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో అన్ని వృత్తివిద్యా కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌ చేపట్టాయి. కొన్ని విద్యా సంస్థలు తమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను ఇళ్లకు పంపేశాయి. ఫీజు బకాయిల విడుదల చేయాలంటూ ప్రైవేటు కాలేజీల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో యాభై శాతం నిధులు ఇస్తే కానీ సమ్మె విరమించేది లేదంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య స్పష్టం చేసింది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు కాలేజీలు తెరిచే నిర్ణయం ఆధార పడి ఉంది.

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2000 వేలకు పైగా వృత్తివిద్యా కాలేజీలతో పాటు పీజీ, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. కీలకమైన సెమిస్టర్ పరీక్షలను సైతం మెజార్టీ కాలేజీలు బహిష్క రించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో యాభై శాతం నిధులు ఇస్తే కానీ సమ్మె విరమించేది లేదంటూ ఉన్నత విద్య సంస్థల సమాఖ్య స్పష్టం చేసింది. మంగళవారం ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లామని ఆయనా సర్కారు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని తెలిపింది. కార్యచరణలో భాగంగా ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మందితో అధ్యాపక సాంత్వన సభ నిర్వహిస్తున్నామంటూ కాలేజీ యాజమాన్యాలు పోస్టర్ విడుదల చేశాయి.

private-colleges-decided-to-continue-bandh-up-to-payment-of-half-of-the-arrears

ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడంతో మరో మార్గం లేక సమ్మెకు దిగామని ఉన్నత విద్య సంస్థల సమాఖ్య నేతలు చెప్పారు. ఫీజు బకాయులు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం బాధాకరమని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం పదిహేను మందితో వేసిన కమిటీపై ఉన్నత విద్య సంస్థల సమాఖ్య సంతోషం అంటూనే అందులోని ఇద్దరు సభ్యులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్ దేవసేనపై ఉన్నత విద్య సంస్థల సమాఖ్య ఫైర్ అయింది. దాదాపు 2వేలకు పైగా కాలేజీలకు రావాల్సిన 10 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో యాభై శాతం అంటే 5వేల కోట్లు ఇవ్వాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటివరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఈ నెల 11న నగర శివారులో చలో హైదరాబాద్ పేరుతో భారీ బహిరంగ సభతో నిరసన కు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+