Bandla Ganesh: రేవంత్ రెడ్డే సీఎం.. తేల్చేసిన బండ్ల గణేష్..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. బండ్ల గణేష్ శనివారం ఉదయం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ 90 సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో హస్తం సునామీ వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది గొప్ప నేతలు ఉన్నారని చెప్పిన బండ్ల రేవంత్ రెడ్డి సీఎం అవుతారని పేర్కొన్నారు.
బండ్ల గణేష్ మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఆదివారం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.













Click it and Unblock the Notifications