వ్యభిచార గృహంలో సోదాలు: కోల్‌కతా, ముంబై మోడల్స్ పట్టివేత
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని అమీర్‌పేట, ఇంద్రానగర్, గోల్కొండల్లో గల వ్యభిచార గృహాలపై పోలీసులు శుక్రవారంనాడు దాడులు చేశారు. సోదాల సందర్భంగా పోలీసులు కోల్‌కతా, ముంబైకి చెందిన మోడల్స్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార అరెస్టు చేశారు.

ఐటి ఉద్యోగాల పేరుతో మోసం
ఇదిలావుంటే, ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను భారీగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా నగదును వసూలు చేశారు. ఇటు ఉద్యోగాలు ఇప్పించకుండా అటు డబ్బులు వాపస్ ఇవ్వకుండా ఉద్యోగార్థులకు కుచ్చుటోపి పెట్టారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసుకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
రెచ్చిపోయిన దొంగలు
హైదరాబాద్ నగరంలోని ఎస్సార్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కార్తీక వనభోజనాలకు వెళ్లి వచ్చే సరికి దుండగులు నాలుగు ఇళ్లను లూటీ చేశారు. జరిగిన దోపిడీపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పిటీషన్‌ను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీలో నగదు,బంగారం పోయినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications