Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాత్రి 8 గంటలైనా కొనసాగిన విచారణ, ఆందోళనతో సిట్‌ ఆఫీస్‌కు పూరీ భార్య.. తీవ్ర ఉత్కంఠ

పూరీ జగన్నాథ్ ను బుధవారం ఉదయం నుంచి విచారిస్తున్న పోలీసులు సాయంత్రం 5 గంటల కల్లా ముగిస్తారని భావించిన అలా జరగలేదు.

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల వ్యవహారం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే 12 మంది సినీతారలకు నోటీసులు జారీ చేసిన సిట్‌.. తొలిరోజైన బుధవారం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో విచారణ ప్రక్రియను ప్రారంభించింది.

ఉదయం 10.30 గంటల నుంచి మొదలైన విచారణ సుదీర్ఘంగా సాగింది. సాయంత్రం 5 గంటలకల్లా విచారణ పూర్తవుతుందని తొలుత అందరూ భావించారు. ఆ మేరకు ప్రచారం కూడా జరిగింది. కానీ వాస్తవంలో అలా జరగలేదు.

రాత్రి వరకు సుదీర్ఘ విచారణ...

రాత్రి వరకు సుదీర్ఘ విచారణ...

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా ముగుస్తుందని తొలుత అందరూ భావించారు. అనంతరం విచారణకు సంబంధించిన అంశాలను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ వెల్లడిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి జరిగింది వేరు. రాత్రి 8.30 గంటల వరకు కూడా పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తూనే ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాత్రి 8.30 గంటలు అవుతున్నా పూరీ జగన్నాథ్ బయటకు రాకపోవడంతో ఆయన భార్య, మేనమామ కూడా తీవ్ర ఉత్కంఠతో ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు.

Recommended Video

    Tollywood Drug Mafia case : Puri Jagannadh Hearing on Tomorrow
    కుమారుడు, సోదరుడితో కలిసి...

    కుమారుడు, సోదరుడితో కలిసి...

    బుధవారం ఉదయమే పూరీ జగన్నాథ్‌ నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తన కుమారుడు ఆకాశ్‌, సోదరుడు సాయిరామ్‌ శంకర్ లతో కలిసి వచ్చారు. అనంతరం వారు అక్కడే ఉండగా.. పూరీ జగన్నాథ్ మాత్రమే సిట్‌ అధికారులు విచారణకు ఏర్పాటు చేసిన ఐదో అంతస్తులోకి వెళ్లారు.

    ప్రశ్నల శరపరంపర...

    ప్రశ్నల శరపరంపర...

    సిట్ అధికారులు విచారణ కోసం ఎక్సైజ్ కార్యాలయంలోని ఐదో అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి పూరీ జగన్నాథ్ ప్రవేశించగానే అధికారులు ఆయనపై ప్రశ్నలను శరపరంపరగా కురిపించారు. పూరీ నుంచి ప్రతి ప్రశ్నకు వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేశారు.

    లోతుగా విచారణ...

    లోతుగా విచారణ...

    శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల సిట్‌ బృందం పూరీ జగన్నాథ్ ను లోతుగా విచారించినట్లు తెలుస్తోంది. మాదకద్రవ్యాల ముఠా నాయకుడు కెల్విన్‌తో పూరీ జగన్నాథ్‌కు ఉన్న సంబంధాలపైనే ఎక్కువగా ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ కు డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్‌తో పరిచయాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్టు సమాచారం. అయితే కెల్విన్‌తో కేవలం వ్యక్తిగత పరిచయమేనా? లేదంటే ఆ పరిచయం డ్రగ్స్‌ తీసుకునే వరకు వెళ్లిందా? అనే అంశంపైనా వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

    డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ...?

    డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ...?

    సుదీర్ఘంగా సాగిన తమ విచారణలో.. డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్‌ నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్‌ తీసుకున్నట్టు అధికారులు ఓ నిర్థారణకు వచ్చారని సమాచారం. అంతేకాకుండా, నటి ఛార్మీ నటించిన ‘జ్యోతిలక్ష్మీ' ప్రచార చిత్రం విడుదల కార్యక్రమంలో కూడా కెల్విన్‌ పాల్గొన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

    రక్త నమూనాలు సేకరించిన అధికారులు...

    రక్త నమూనాలు సేకరించిన అధికారులు...

    ఒకవైపు పూరీ జగన్నాథ్ ను విచారిస్తూనే మరోవైపు ఆయన రక్తం నమూనాలు సేకరించేందుకు అధికారులు ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైద్య బృందాన్ని పిలిపించారు. వారు రక్త నమూనాలను సేకరించేందుకు అవసరమైన కిట్లను తమ వెంట తీసుకొని వచ్చారు. వైద్య బృందం తొలుత అకున్‌ సబర్వాల్‌తో మాట్లాడి ఆ తరువాత పూరీ జగన్నాథ్ రక్త నమూనాలు సేకరించారు.

    అరెస్టు భయం లేదు కానీ...

    అరెస్టు భయం లేదు కానీ...

    ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఎన్డీపీఎస్‌ సెక్షన్‌ 67 ప్రకారం ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేయడం వల్ల ఇప్పుడు ఆయన్ని అరెస్టు చేసే అవకాశం లేదని తెలిసింది. అయితే, పూరీ జగన్నాథ్‌ మాదకద్రవ్యాలను వాడుతున్నారా? లేదంటే సినీ పరిశ్రమలోగాని, బయటగాని ఎవరికైనా ఆయన సరఫరా చేస్తున్నారా? అసలు పూరీకి కెల్విన్‌ ముఠాతో ఉన్న సంబంధాలేమిటి? అనే అంశాలపై అధికారులు లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. బుధివారం నాటి విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగానే.. వచ్చే 12 రోజుల్లో విచారణ చేపట్టే అంశంపై దృష్టిపెడుతున్నందున ఇంకా పలు వివరాలు తెలుసుకొనేందుకు అధికారులు ప్రయత్నించినట్లు సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+