‘పుష్ప’ సినిమా నటుడు జగదీశ్ అరెస్ట్: ఆ మహిళా ఆర్టిస్ట్ ఆత్మహత్యకు కారణం ఇతడేనా?

హైదరాబాద్: టాలీవుడ్ తోపాటు బాలీవుడ్‌లోనూ సంచలన విజయం సాధించిన 'పుష్ఫ' చిత్రంలో హీరో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్(కేశవను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు.

జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న బాధిత మహిళా జూనియర్ ఆర్టిస్ట్ నవంబర్ 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ మహిళ బలవన్మరణానికి కారణాలు తెలుసుకున్నారు.

 pushpa movie fame jagadish arrested in Hyderabad

మహిళ నవంబర్ 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తప్పించుకున్న తిరుగుతున్న జగదీశ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్ కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

కాగా, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎంత పేరు వచ్చిందో.. పుష్ప స్నేహితుడు కేశవగా నటించిన జగదీశీ‌కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత జగదీశ్ రేంజ్ పెరిగిపోయింది. పుష్ప విజయం తర్వాత 'సత్తిగాని రెండెకరాలు' అనే వెబ్ సిరీస్‌లో హీరోగా జగదీశ్ నటించాడు. పలు సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి కేసులో కటకటాల వెనక్కి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+