కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్: ఏడుగురు సీనియర్లు సస్పెండ్
వరంగల్: డాక్టర్ ప్రీతి ఘటన మరువక ముందే మరోసారి ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు తేలింది. దీంతో విచారణ జరిపిన కాలేజీ యాజమాన్యం ఏడుగురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు.
జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ తోపాటు దాడి నేపథ్యంలో వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. దాదాపు ఆరు గంటలపాటు యాంటీ ర్యాగింగ్ సభ్యులు సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 14వ తేదీన హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది.

జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కి పాల్పడిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్, దాడి చేసిన ఏడుగురు సీనియర్ విద్యార్థులను మూడు నెలలపాటు కాలేజీ నుంచి, ఏడాదిపాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేసినట్లు కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు.
ఈ ఏడుగురిపై ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో 20 మందికి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగడం ఇదే తొలిసారని చెప్పారు.
ర్యాగింగ్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. ఇప్పటికే ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై మట్వాడ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఇది ఇలావుండగా, పది రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ ఘటన జరిగింది. ఈ కేసులో ర్యాగింగ్ కు పాల్పడిన పది మంది ఎంబీబీఎస్ విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications