లోయర్ బెర్తు కేటాయింపు పై రైల్వే తాజా నిర్ణయం, ఇక వారికే..!!
రైలు ప్రయాణంలో లోయర్ బెర్తుకు ప్రయాణీకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. రిజర్వేషన్ సమయంలో ఈ బెర్తు కోసం పెద్ద సంఖ్యలో రిక్వెస్టులు వస్తున్నాయి. అయితే.. ఈ బెర్తుల ఖరారు విషయంలో కొన్ని మార్గదర్శకాలను రైల్వే అమలు చేస్తోంది. ఈ బెర్తుల కేటాయింపులో సీనియర్ సిటిజెన్స్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా మరి కొందరికి ఈ బెర్తుల కేటాయింపు పైన రైల్వే శాఖ వెసులుబాటు కల్పిస్తోంది.
రైల్వే ప్రయాణంలో రిజర్వేషన్ బోగీల్లో సీనియర్ సిటిజెన్స్ కు మరిన్ని లోయర్ బెర్తుల కేటాయింపు విషయంలో రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. గర్భిణులు, 60 సంవత్సరాల పైబడిన పురుషులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు లోయర్‌బెర్తు కేటాయిస్తున్నారు. అయితే, టికెట్ బుకింగ్ సమయంలోనే కావాల్సిన వివరాలను ఎంటర్ చేసి, లోయర్ బెర్తు కోటా ఆప్షన్ ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న వాటికి అనుగుణంగా ఖరారు చేస్తున్నారు.

తాజాగా రైల్వే శాఖ క్లాసుల వారీగా కేటాయింపులు నిర్దారించింది. స్లీపర్ క్లాస్ విభాగంలో ప్రతి కోచ్‌లో 6 - 7 లోయర్ బెర్త్‌లు వీరికి కేటాయిస్తున్నారు. ఏసీ త్రీటైర్ లో నాలుగు నుంచి ఐదు, ఏసీ టూ-టైర్ లో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్తులు కేటాయిస్తున్నారు.
ఇక, సీనియర్ సిటిజన్స్ కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషనల్లో వీల్‌చైర్లను రైల్వేశాఖ అందుబాటులో ఉంచింది. వీటిని విధుల్లో ఉన్న టికెట్ కలెక్టర్ లేదా స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇవ్వటం ద్వారా వినియోగించుకునే సౌలభ్యం ఉంది. నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్, కాచిగూడ లాంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో వృద్ధులు, గర్భిణులు తాము ఎక్కే బోగీ వరకూ చేరుకునే సౌలభ్యం కల్పించారు. వృద్ధులు, వైకల్య బాధితులు ఒక ప్లాట్‌ఫాం నుంచి మరోదానికి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 119 స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉన్నాయి.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications