చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్తున్నారా, బిగ్ అప్డేట్ - ఇక నుంచి..!!
చర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభం నుంచి చర్లపల్లి స్టేషన్ ప్రధాన కేంద్రంగా మారింది. అన్ని ముఖ్య రైళ్లు దాదాపు గా చర్లపల్లి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్ పైన భారం తగ్గే విధంగా చర్లపల్లి స్టేషన్ కు రైళ్లను మార్పు చేస్తున్నారు. కాగా, చర్లపల్లి స్టేషన్ కు జంట నగరాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణీకులకు కొన్ని సమస్యలు తప్పటం లేదు. ఇక.. చర్లపల్లి కేంద్రంగా రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించి.. ప్రారంభించిన సమయం నుంచి పెద్ద సంఖ్యలో ప్రధాన రైళ్ల రాకపోకలకు కేంద్రంగా మారింది. సికింద్రాబాద్ నుంచి గతంలో రాకపోకలు సాగించిన రైలు ప్రయాణీకులు ఇప్పుడు చర్లపల్లి వరకు రావాల్సి వస్తోంది. అయితే, చర్లపల్లికి రాత్రి.. వేకువ జాము న రాకపోకలు సాగించే రైళ్ల ప్రయాణీకులకు దూరం ప్రాంతాలకు చెందిన వారికి ఇబ్బందులు తప్పటం లేదు. దీంతో..చర్లపల్లి నుంచి మరిన్ని ఆర్టీసీ బస్సులు వేకువ జాము నుంచే మరిన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీకి సూచనలు అందాయి. దీని పైన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక.. అధునాతన సౌకర్యలతో తీర్చిదిద్దుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రయాణీకులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

కాగా, ఇటు చర్లపల్లి స్టేషన్ లో ప్రయాణీకుల భద్రత కోసం తాజాగా పలు కీలక నిర్ణయాలను అధికారులు అమలు చేస్తున్నారు. ప్రయాణీకుల రక్షణ, అనుమానితుల కదలికలపై నిఘా, చట్టవిరోధ కార్యకలాపాలను అరికట్టే దిశగా ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చడం ద్వారా అత్యాధునిక భద్రతా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా అనుమానితులు రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించిన వెంటనే వారి వివరాలు తెలిసే ఈ సాంకేతిక వ్యవస్థ రైల్వే భద్రతను మరింత పటిష్టం చేస్తుంది.
చర్లపల్లి టెర్మినల్‌లో మొత్తం 250 సీసీటీవీ కెమెరాలు, అందులో 15 అధు నాతన ఎఫ్.ఆర్ కెమెరాలు అమర్చారు. ప్రవేశ మార్గాలు, టిక్కెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫామ్స్, విశ్రాంతి గదులు, ఏటీవీఎం మెషీన్ల వద్ద గుర్తించిన బ్లాక్‌స్పాట్స్‌కు ప్రత్యేకంగా ఈ కెమెరాలను అమర్చారు. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను స్టేషన్‌లో ఏర్పాటు చేసి, ప్రతి కెమెరా నుంచి వస్తున్న వీడియో ఫీడ్‌ను రియల్ టైమ్‌లో పరిశీలించే విధానం అమలులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications