తెలంగాణాను మరో మూడురోజులు వదల బొమ్మాలీ అంటున్న వర్షాలు
తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడేలా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని కేంద్రం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు
రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 17వ తేదీన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ జిల్లాలలో ఎల్లోఅలర్ట్
జూన్ 18వ తేదీన ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, ములుగు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలలో ఎల్లోఅలర్ట్ జారీ చేసినట్టు వాతావరణశాఖ పేర్కొంది. ఇక జూన్ 19వ తేదీన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
జూన్ 20వ తేదీన కూడా తేలికపాటి వర్షాలు
కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 20వ తేదీన కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎటువంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.












Click it and Unblock the Notifications