అల్లు అర్జున్ బెయిల్ - షారూఖ్ ఖాన్ టు చంద్రబాబు..!!

అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటీషన్ లో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా బాధ్యడు కాదని కోర్టుకు నివేదించారు. ఇది అక్రమ అరెస్ట్ అని.. క్వాష్ చేయాలని కోర్టును అభ్యర్ధించారు. గుజరాత్ లో జరిగిన తొక్కిసలాటలో నాడు షారూఖ్ ఖాన్ ప్రమేయం.. చంద్రబాబు సీఎంగా ఉండగా గోదావరి పుష్కరాల వేళ చోటు చేసుకున్న తొక్కిసలాట అంశాలు వాదనల్లో ప్రస్తావనకు వచ్చాయి.

అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో అల్లు అర్జున్ ప్రమేయం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ముందస్తుగా పోలీసులకు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచ్చిందని వివరించారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా బాధ్యడు కాదని కోర్టుకు నివేదించారు. ఇది అక్రమ అరెస్ట్ అని.. క్వాష్ చేయాలని కోర్టును అభ్యర్ధించారు. వాదనలు విన్న తరువాత న్యాయస్థానం అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది.

Rajahmundry Godavari Pushkara stampede issue mentioned in Allu Arjun bail arguments in High Court

ఈ వాదనల్లో భాగంగా న్యాయవాది నిరంజన్ రెడ్డి 2015లో ఏపి లో జరిగిన పుష్కరాల కేస్ గురించి హైకోర్టు లో ప్రస్తావించారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ కు ప్రత్యక్ష ప్రమేయం లేదరి వాదనలు కొనసాగించారు. 2017లో గుజరాత్ లో ఇలాంటి తొక్కిసలాట ఘటనే జరిగిన సమయం లో నాడు హీరో షారూఖ్ ఖాన్ ను కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. 105 సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదని న్యాయవాదులు వాదించారు. అల్లు అర్జున్ కు సినిమా చూసే హక్కు ఉందని.. ఎవరి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు.

ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చిన విషయాన్ని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. 2017లో గుజరాత్ లో ఇలాంటి తొక్కిసలాట ఘటనే జరిగిన సమయం లో నాడు హీరో షారూఖ్ ఖాన్ ను కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. 105 సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదని న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం అని చెప్పుకొచ్చారు. అటు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. ఇటు హైకోర్టులో వాదనలు పూర్తయిన తరువాత న్యాయస్థానం అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+