తెలంగాణలో రాజశ్యామల యాగం: కమల హ్యారిస్ కోసం
Donald Trump vs Kamala Harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరింది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య ప్రీ పోల్ సర్వే వివరాలు వెలుగులోకి వచ్చాయి. ది న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఇది. ఇందులో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌కు సమనంగా ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరికీ 48 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
ఈ నెల 20 నుంచి 24 తేదీల్లో నిర్వహించిన సర్వే ఇది. దాదాపుగా అన్ని రాష్ట్రాలకు చెందిన 2,516 మంది రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి వారి అభిప్రాయాలను సేకరించారు. దీన్ని క్రోడీకరించిన అనంతరం ఫైనల్ పోల్ సర్వే రిపోర్ట్‌ను ప్రచురించింది న్యూయార్క్ టైమ్స్. ఇద్దరికీ 48 శాతం చొప్పున ఓట్లు పడినట్లు తెలిపింది.
నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ ఎంత హోరాహోరీగా ఉండబోతోందనేది ఈ ప్రీ పోల్ సర్వే స్పష్టం చేసింది. కీలకమైన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిజ్ రాష్ట్రాల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు పడటం చర్చనీయాంశమైంది. నెవడా, నార్త్ కరోలినా, అరిజోనా, జార్జియాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇద్దరికీ సమాన ఓట్లు పడ్డాయి.
#WATCH | Bhadradri Kothagudem, Telangana: 11-day Sri Raja Syamalamba Samhita Shata Chandi Purvaka Sudarshana Maha Yagna was organised for the victory of US Democratic Presidential candidate Kamala Harris. (29.10) pic.twitter.com/qlewgwpvmN
— ANI (@ANI) October 29, 2024
ఈ పరిస్థితుల్లో కమలా హ్యారిస్ గెలుపు కోసం తెలంగాణలో రాజశ్యామల మహాయాగం మొదలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ నెల 20వ తేదీన ఈ యాగం ఆరంభమైంది. నేడు పూర్ణాహుతితో ముగియనుంది. స్థానిక ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ సురేష్ రెడ్డి దీన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications