Balagam: బలగం సినిమా డైరెక్టర్ వేణు థ్యాక్స్ కూడా చెప్పలేదు.. !
బలగం సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో కుటుంబ సంబంధాలను చక్కగా వివరించారు. ఈ చిత్రం క్లైమాక్స్ వచ్చే మొగిలయ్య, కొమురమ్మ యక్షగానం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం సిరిసిల్ల జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగింది. ముఖ్యంగా కొమురయ్య ఇల్లు ప్రత్యేకంగా నిలిచింది.
ఈ ఇల్లు కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో ఉంది. అయితే ఈ ఇంటి యజమాని రవీందర్ రావు దర్శకుడు వేణుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బలగం సినిమా డైరెక్టర్ వేణుది తమ ఊరేనని చెప్పారు. సాయం చేయమని అడిగితే తన ఇల్లు ఇచ్చానని తెలిపారు.

నెలన్నర రోజులు తన ఇంట్లో షూటింగ్ చేస్తే తాము వేరే ఇంట్లో ఉన్నామని. డబ్బులిస్తామన్నారు. కానీ తానే డబ్బులు తీసుకోలేదని చెప్పారు. ఈ సినిమా పెద్ద హిట్ అవడం సంతోషంగా ఉంది. సినిమాలో త ఇల్లు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఏనాడూ దిల్ రాజు రాలేదన్నారు. ఆయన కూతురు, తమ్ముడి కొడుకు మాత్రమే వచ్చారని రవీందర్ రావ్ తెలిపారు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదని.. తన నెంబర్ ఆయన దగ్గర ఉంది కానీ ఫోన్ చేయలేదన్నారు.
బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. కాగా ఈ సినిమా చివరలో పాట పాడిన మొగిలయ్య ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. మొగిలయ్యను అనారోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి.
మొగిలయ్యకు కళ్లు కూడా సరిగా కనబడడం లేదు. బలగం సినిమాలో తన పాటతో కోట్లాది మంది హృదయాలను కదిలించిన మొగిలయ్య, కొమురమ్మ దంపతుల నిజ జీవిత గాథ అందరని కదిలిస్తోంది. పస్తం మొగిలయ్య స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామం. మొగిలయ్య దంపతులు ఊరూరా తిరుగుతూ కథలను గానం చేస్తూ ఉపాధి పొందేవారు.
వీరిని చూసిన బలగం సినిమా డైరెక్టర్ వేణు బలగం సినిమా క్లైమాక్స్ లో వీరి పాటతో పాటు నంటించే అవకాశం కల్పించారు. సినిమా చివరలో వీరు చేసిన కథా గానం చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగిలయ్య.. కిడ్నీ వ్యాధితో పాటు ఆయనకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications