Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

t pcc chief race: ప్రచార కమిటీ చైర్మన్ అయినా ఓకే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

టీ పీసీసీ చీఫ్‌ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోన్న వేళ.. ఫ్రంట్ రన్నర్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవీ మీద మోజు లేదని ఇండెరెక్టుగా ఇండికేషన్స్ ఇచ్చారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవీ ఇచ్చినా ఓకే అంటూ స్వరం కాస్త మార్చారు. రేవంత్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవీ కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. తమ అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ చెప్పుకునే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పారు.

ready to take campaign committee chairman post:Revanth reddy

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ, ప్రచార కమిటీ చైర్మన్ పదవులు చాలా కీలకమని రేవంత్ తెలిపారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవీని తనకు ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తే... ఆ పదవీ స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏ పదవి కావాలని అడిగితే తాను ప్రచార కమిటీ ఛైర్మన్ పదవినే అడుగుతానని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో సరికొత్త చర్చ మొదలైంది.

రేవంత్‌కు పీసీసీ చీఫ్ ఇవ్వకపోతే.. బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోందని.. అలా అయితే కాంగ్రెస్‌లో చేరక ముందే చేరేవాడినని స్పష్టంచేశారు. దుబ్బాకలో ఎలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ గెలిచిందో తెలిసిందే అని చెప్పారు. బీజేపీ పేపర్ టైగర్.. ఆ పార్టీ గెలుపు వన్ టైం వండర్‌గా భావించొచ్చు అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను గెలవడానికి టీఆర్ఎస్ వాళ్లు కూడా కృషి చేశారని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+