అలా వెళ్తే.. ఎక్కడ తప్పుగా అనుకుంటాడోనని: ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య వెనుక..
Recommended Video

హైదరాబాద్: హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన అనీషా చౌదరి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె తన పాత బాయ్ ఫ్రెండ్ వివాహానికి వెళ్లాలనుకోవడం.. ప్రస్తుత బాయ్ ఫ్రెండ్‌కు ఎక్కడ కోపం తెప్పిస్తుందోనన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. ఆత్మహత్యలో ఇంకెవరి పాత్ర లేదని తేల్చారు.

ఎవరీ అనీషా..:
కొంపల్లిలోని శివశివానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది అనీషా చౌదరి(24). ఆమెకు గతంలో అనంతపురానికి చెందిన ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇటీవలే అతని పెళ్లి కూడా కుదరడంతో అనీషాను ఆహ్వానించాడు. పెళ్లికి వెళ్లాలా? వద్దా? విషయమై తర్జనభర్జన పడ్డ అనీషా.. విషయాన్ని ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ దక్షేశ్ పటేల్‌కు తెలిపింది.

తప్పుగా అనుకుంటాడేమోనని..:
దక్షేశ్ పటేల్ కూడా ఆమెకేమి అభ్యంతరం చెప్పలేదు. అనీషా పెళ్లికి వెళ్తానని అడగ్గానే వెళ్లమని చెప్పాడు. కానీ ఆ తర్వాత లేనిపోని అపోహలతో ఆమె సతమతమైంది. పెళ్లికి వెళ్తే దక్షేశ్ పటేల్ తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడోనని తనలో తానే ఆవేదన చెందింది.

హాస్టల్ గదిలోనే ఆత్మహత్య..:
పైగా హాస్టల్ గదిలోనూ ఆరోజు అనీషా ఒక్కరే ఉండటం కూడా ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమెతో పాటు ఉండే స్నేహితురాలు అంతకు ముందురోజే ఊరెళ్లడంతో గదిలో అనీషా ఒంటరిగా ఉంది. అదే క్రమంలో ఈ ఆలోచనలన్ని చుట్టుముట్టడంతో బాగా కుంగపోయింది. చివరకు అదే రోజు రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.

వీడియో కాల్ మాట్లాడుతూనే..:
16వ తేదీ రాత్రి ఆత్మహత్యకు ముందు అనీషా చౌదరి తన బాయ్ ఫ్రెండ్‌కు సుమారు 350 వాట్సాప్ మెసేజ్‌లు పంపించింది. రాత్రి 8గం. నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు మెసేజ్‌లు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
బాయ్ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్దారించారు. అయితే బాయ్ ఫ్రెండ్ దక్షేశ్ పటేల్ నుంచి ఎటువంటి ఒత్తిడి లేదని, అనీషానే మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications