తెలంగాణ వైద్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది ప్రభుత్వం. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. మార్చి 16న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైద్యారోగ్య సర్వీసు నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌లో 3235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1255 పోస్టులు భర్తీ చేయనుంది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్‌లో34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

recruitment of 5348 posts in medical and health department telangana finance department green signal

కాగా, వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది.

జూన్ 20 వరకు డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ

డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు: దరఖాస్తు గడువు పొడిగింపు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ(DSC) పరీక్షకు తేదీలను ఖరారు చేసింది విద్యాశాఖ. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే, తాజాగా, ఈ తేదీని జూన్ 20 వరకు పొడిగించారు.

మొత్తం ఉద్యోగాల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు ఉన్నాయి. ఇంకా, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా, ఆ తర్వాత ఖమ్మంలో 757, నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+