నామాకు , కేసీఆర్ కు నామాలు పెట్టండి ..దమ్మేమిటో చూపించండి .. రేణుకా చౌదరి

తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరు ఒక ఎత్తైతే ఖమ్మం జిల్లా పోరు మరో ఎత్తు. చాలా విలక్షణమైన ఈ జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చావుదెబ్బ తింది. రాష్ట్రమంతా టీఆర్ఎస్ ప్రభంజనం ఉన్నా ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ పప్పులు ఉడకలేదు. దీంతో ఈ ఎన్నికల్లో అయినా ఖమ్మం కోట మీద గులాబీ జెండా ఎగురవేయ్యాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది గులాబీ దళం . ఇప్పటికే అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీ నుండి వచ్చిన సీనియర్ నాయకుడు, స్థానికంగా పట్టున్న నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ . అంతే కాదు మంత్రులను , ముఖ్య నేతలను రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తుంది.

ఫిరాయింపు నేతలకు బుద్ధి చెప్పండి అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న రేణుకా చౌదరి

ఫిరాయింపు నేతలకు బుద్ధి చెప్పండి అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న రేణుకా చౌదరి

ఇక త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలలో ఖమ్మం స్థానం ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఖమ్మంలో టీడీపీ , కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉండటం వల్ల నేతలు పార్టీ మారినప్పటికీ ఖమ్మంపై ఆశ పెట్టుకుంది కాంగ్రెస్ . ఇక నామాను ధీటుగా ఎదుర్కొనే సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరీని రంగంలోకి దించింది. ఇక రేణుక కూడా మాటల తూటాలు పేలుస్తూ ఫిరాయింపు నేతలకు బుద్ధి చెప్పండి అన్న పిలుపుతో ప్రజలలోకి వెళ్తున్నారు.

కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం ... కేసీఆర్ ఆటలు ఇక్కడ సాగవు అన్న రేణుకా చౌదరి

కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం ... కేసీఆర్ ఆటలు ఇక్కడ సాగవు అన్న రేణుకా చౌదరి


ఇక ఇదే క్రమంలో ప్రచారం నిర్వహిస్తున్న రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచు కోట అని అభివర్ణించారు. ఇక్కడ కేసీఆర్ ఆటలు సీఎం కేసీఆర్, ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న రేణుకా చౌదరి ఈరోజు అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామాను గెలిపిస్తే ప్రజలకు నామాలు పెడతాడన్నారు .

నామాను గెలిపిస్తే నామాలే . మీరే నామాకు, కేసీఆర్ కు నామాలు పెట్టండన్న రేణుకా చౌదరి

నామాను గెలిపిస్తే నామాలే . మీరే నామాకు, కేసీఆర్ కు నామాలు పెట్టండన్న రేణుకా చౌదరి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నామాకు ఓటేసి నామాలు పెట్టించుకోవద్దని ఈ విషయాన్ని అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు రేణుకా చౌదరి . కేసీఆర్ కు, నామాకు ప్రజలు నామాలు పెట్టి వెనక్కి పంపాలంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీల దమ్ము ఏంటో కేసీఆర్ కు, దేశానికి తెలియాలంటే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జామాయిల్, పామాయిల్, సుబాబుల్ రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చిన రేణుకా చౌదరి కేసీఆర్ పైన , నామా నాగేశ్వరరావుపైన విరుచుకుపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+