దమ్ముంటే రాజీనామా చెయ్యండి.. టీఆర్ఎస్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈటల రాజేందర్ సవాల్!!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో బీజేపీ కీలక నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా గోస బిజెపి భరోసా బైక్ ర్యాలీలతో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజా గోస బిజెపి భరోసా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.

పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులకు ఈటల రాజేందర్ సవాల్

పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులకు ఈటల రాజేందర్ సవాల్

పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ ఛాలెంజ్ చేశారు. రోషం ఉన్న వ్యక్తి కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, బై ఎలక్షన్స్ రావాలంటే దమ్ము కూడా ఉండాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన ఐదు నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదించారని పేర్కొన్న ఆయన రాజగోపాల్ రెడ్డి తరహాలో మీ నియోజకవర్గాలలో ప్రజాభిప్రాయాన్ని కోరాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాజీనామా చెయ్యండి

మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాజీనామా చెయ్యండి

12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ పార్టీలో చేరారు అని గుర్తు చేసిన ఆయన, కొంతమంది మంత్రి పదవులు కూడా వెలగబెడుతున్నారు అంటూ మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, మీ నియోజకవర్గాల అభివృద్ధి జరగాలంటే, నియోజకవర్గాల అభివృద్ధి మీరు నిజంగా ఆకాంక్షిస్తే మీరు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో 10 లక్షల మందికి పెన్షన్ ప్రకటించారని గుర్తు చేసిన ఈటల రాజేందర్, రాజకీయాల్లో కూడా నైతికత ఉండాలంటూ పార్టీ ఫిరాయించిన నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    ఆజాదీ సాయంతో మోడీ జమిలి ప్లాన్ *National | Telugu OneIndia
    దమ్ము ధైర్యం ఉన్న నాయకులు రాజీనామా చేసి పార్టీ మారాలన్న ఈటల రాజేందర్

    దమ్ము ధైర్యం ఉన్న నాయకులు రాజీనామా చేసి పార్టీ మారాలన్న ఈటల రాజేందర్

    రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ పార్టీలో చేరి కొంతమంది నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎవరైనా సరే పార్టీ మారాలంటే రాజీనామా చేయాలని, దమ్ము ధైర్యం ఉన్న నాయకులు రాజీనామా చేసి రావాలని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇక బిజెపిలోకి చేరికలు కొనసాగుతాయని చెప్పిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరికలను ఎవరూ ఆపలేరు అంటూ పేర్కొన్నారు. చేరికలు ఒకరితో ఆగిపోయేవి కాదని కొనసాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

    భవిష్యత్ లో కుప్పలు కుప్పలుగా బీజేపీలోకి చేరికలు

    భవిష్యత్ లో కుప్పలు కుప్పలుగా బీజేపీలోకి చేరికలు


    భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీ దేనని, కుప్పలు కుప్పలుగా బిజెపిలో రాజకీయ నాయకులు జాయిన్ అవుతారంటూ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులు దమ్ముంటే రాజీనామా చేయాలని, ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు వెళ్లాలని ఈటల రాజేందర్ సవాల్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+