రైతు బంధు ఇస్తారా? ఉద్యోగుల జీతాల మాటేంటి? సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సూటిప్రశ్నలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఉద్యోగులకు జీతాలు, రైతులకు రైతు బంధు నిధులు ఇవ్వకపోవడంపై ముఖ్య మంత్రి కెసిఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు.

స్వారాష్ట్రంలో 8 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకు పడుతున్న రేవంత్ రెడ్డి తాజాగా రాష్ట్రంలో హోంగార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి వేతనాలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో దివాలా తీయించారని మండిపడ్డారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానం 8 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయి అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, జూన్ నెల ముగుస్తున్నా ఇంకా మే నెల జీతం వారి ఖాతాలలో పడలేదని పేర్కొన్నారు.

ఈ దుస్థితికి కారణం చెప్పాలి .. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ప్రశ్న
ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని తమ నిర్వాకాన్ని ఎలా చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. మోడల్ స్కూల్స్ లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. టీచర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. మే నెల జీతాల కోసం ఉద్యోగులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రైతుబంధు నిధుల పైన కూడా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

రైతుబంధు ఇస్తే ఎప్పుడు ఇస్తారో చెప్పాలి
తొలకరి వర్షాలు పడుతున్నాయి అని, వానకాలం సాగుకు సమయం ఆసన్నమైనా ఇంతవరకు రైతుబంధు నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు. అసలు ఈ సారి రైతుబంధు ఉంటుందా లేదా చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ రైతుబంధు ఇస్తే ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. నిరుపేద రైతులు రైతుబంధు కోసం నిరీక్షిస్తున్నారు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్... వీఆర్ఎస్ అంటూ ప్రజలకు కనిపించకుండా తిరుగుతున్నారని, అసలు రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో చెప్పాలి
రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి, రైతుబంధు నిధులు ఇవ్వని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. అప్పుల ద్వారా,భూముల అమ్మకం ద్వారా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా,కరెంట్,భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల, బస్ ఛార్జీల పెంపు ద్వారా,మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో ? చెప్పాలంటూ సీఎం కేసీఆర్ ను నిలదీశారు.

తక్షణమే జీతాలు ఇవ్వాలి .. లేదంటే కాంగ్రెస్ కార్యాచరణ
అంతేకాదు మీ తెలంగాణ సీఎంఓ రాజకీయ విన్యాసాలు ఆపి, చిరు ఉద్యోగులైనహోం గార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి తక్షణం మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లేని పక్షంలో ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారికి అండగా ప్రభుత్వంపై పోరాటం చేసి ఒత్తిడి తెస్తామని చెప్పారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications