మీకు హిమాన్షు.. మాకు దేవాంశ్: రేవంత్ ఆ మాట అనడంతో.. ఒక్కసారిగా నవ్వులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ, ప్రసంగానికి అడ్డుపడ్డారన్న ఆరోపణతో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకు వారిపై సస్పెన్షన్ వేటు కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. ఆయన రాకను గమనించిన ఎంపీ బాల్క సుమన్.. ఆయనతో మాటలు కలిపే ప్రయత్నం చేశారు. 'సస్పెండ్ అయినా లోపలికి ఎలా రానిచ్చారన్నా'అని సరదాగా ప్రశ్నించారు. దీంతో 'హిమాన్షు.. వాళ్ల తాత కేసీఆర్ కు చెప్పి నన్ను ఇక్కడిదాకా అనుమతించేలా చేశాడు' అని రేవంత్ చమత్కారంగా బదులిచ్చారు.

Revanth reddy funny conversation with balka suman

అంతేకాదు, మీలాంటి స్నేహితులు ఉండి ఏం లాభం?, మీ కన్నా హిమాన్షు బెటర్ అంటూ టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి రేవంత్ సరదా వ్యాఖ్యలు చేశారు. మీకు హిమాన్షు.. మాకు దేవాంశ్ అంటూ రేవంత్ కామెంట్ చేయడంతో అక్కడున్న నాయకులంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కాగా, హిమాన్షు తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు, దేవాంశ్ టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana TDP working president Revanth Reddy talked to MP Balka Suman on this morning at Assembly. A funny conversation was took place between these two
Please Wait while comments are loading...