ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు: కేటీఆర్ పై ఘాటుగా రేవంత్ రెడ్డి
ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో, కోడ్ ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై నజర్ పెట్టాయి. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్ కు వరుస ఫిర్యాదులు చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాటిని ఇవ్వకుండా అవుతుందని, రైతుబంధుని కూడా ఇవ్వద్దని చెబుతుందని టార్గెట్ చేశారు.ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అందులో కూడా కెసిఆర్ నే కనిపిస్తాడని కాంగ్రెస్ ను ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోమారు రుజువైందని, అన్నదాత పాలిట కాంగ్రెస్ నెంబర్ వన్ విలన్ అని ఇంకోసారి తేలిపోయిందని, పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు అంటూ పేర్కొన్నారు. రైతు బంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అని, కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని వ్యాఖ్యలు చేశారు.
ఇక కేటీఆర్ చేసిన పోస్టుపై మండిపడిన రేవంత్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు అంటూ కేటీఆర్ ను టార్గెట్ చేశారు. నిజంగానే నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు, నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు అని పేర్కొన్నారు.
నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు అన్న ఆయన నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదేనని స్పష్టం చేశారు. నీలాంటి వాడిని చూసే... "నిజం చెప్పులు తొడుక్కునే లోపు... అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది" అనే సామెత పుట్టిందని ఎద్దేవా చేశారు. డ్రామాలు ఆపి... నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు... లేదంటే కాంగ్రెస్ వచ్చి...పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై రివర్స్ ఎటాక్ చేశారు.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications