పోటీకి రేవంత్ సిద్ధం, మధ్యాహ్నం గన్‌మెన్ల సరెండర్: కార్యకర్తలతో భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/కొడంగల్: రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.

చదవండి: ఉండలేను, వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి

రాజీనామా ఆమోదిస్తే, ఉప ఎన్నిక వస్తే కొడంగల్‌లో తిరిగి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు, ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి బరిలో దిగనున్నారని తెలుస్తోంది.

Revanth Reddy meets with followers in Kodangal

రేవంత్ అమరావతి నుంచి శనివారం రాత్రి కొడంగల్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రేవంత్ రెడ్డి జిందాబాద్‌, కేసీఆర్‌ కొడంగల్‌ నుంచి పోటీ చేస్తే మా సత్తా చూపిస్తామని నినదించారు.

చదవండి: రేవంత్ వెళ్లకుండా ఆపండి: అమిత్ షా ఫోన్, చేతులెత్తేసిన బాబు

  Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

  రేవంత్ ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నెల రోజుల్లో ఎమ్మెల్యే క్వార్టర్ ఖాళీ చేయనున్నారు. వికారాబాద్ పోలీసులకు మధ్యాహ్నం తన గన్‌మెన్‌లను సరెండర్ చేయనున్నారు. ఇప్పటికే పీఏను వెనక్కి పంపారు.

  మరోవైపు, ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలను కలిసి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kodangal MLA Revanth Reddy has met his followers on Sunday morning in Kodangal. He may join Congress Party soon.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి