తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!!

తెలంగాణ శాసనసభ వేదికగా రాష్ట్ర ఆరోగ్య రంగంలో పెను మార్పులు తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా " ఇందిరమ్మ జీవిత బీమా" నుంచి టిమ్స్ (TIMS) ఆసుపత్రుల ఆధునీకరణ వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్రంలోని సామాన్యుడికి వైద్యం భారం కాకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హెల్త్ సెక్టార్‌పై కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ లోపాలను ఎండగడుతూనే, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.

revanth-reddy-mega-health-plan-free-insurance-for-1-15-cr-families-and-hospital-upgrades

ఆరోగ్య రంగంలో సంస్కరణలు

కుల గణన నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని కోటీ 15 లక్షల కుటుంబాలకు 'ఇందిరమ్మ జీవిత బీమా' సౌకర్యాన్ని కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు.ఇకపై టీచింగ్ హాస్పిటల్స్‌కు నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి నిధులు కేటాయిస్తారు. తద్వారా అక్కడ వైద్య సేవలు, నిర్వహణ మెరుగుపడతాయి. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం గ్రూప్-1 స్థాయి అధికారిని నియమించనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 627 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేస్తోందని సీఎం తెలిపారు. ఇప్పటివరకు రూ. 2,408 కోట్లు చెల్లించామని, ప్రస్తుతం కేవలం రూ. 727 కోట్లు మాత్రమే బకాయి ఉన్నాయని స్పష్టం చేశారు.

వరంగల్, అల్వాల్, ఎల్బీ నగర్, సనత్ నగర్‌లలోని టిమ్స్ ఆసుపత్రులను స్పెషలైజ్డ్ మెడికల్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామని, అదనంగా 10,000 బెడ్ల సామర్థ్యాన్ని పెంచుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.గోషామహల్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,000 కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.

ఎన్ఆర్ఐ డాక్టర్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్

తెలంగాణకు చెందిన వేలమంది వైద్యులు విదేశాల్లో స్థిరపడ్డారని, వారు తమ సొంత ఊర్లకు వచ్చినప్పుడు స్థానిక ఆసుపత్రుల్లో సేవలు అందించేలా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో CMRF చెక్కుల జారీలో అవకతవకలు జరిగాయని,వాటిని అరికట్టేందుకే తమ ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని తెచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ బకాయిలను సకాలంలో చెల్లించకుండా గత ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై భారం మోపిందని విమర్శించారు.

"విద్య, వైద్యం.. ఈ రెండే మా ప్రభుత్వ ప్రాధాన్యతలు" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 4,500 కోట్ల భారీ కేటాయింపులతో పేద ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు ఆరోగ్య తెలంగాణ దిశగా ఒక గొప్ప మలుపుగా భావించవచ్చు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఈ సంస్కరణలు క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+