Revanth Reddy: వచ్చే నెల నుంచి రైతుల ఖాతాల్లో రూ.15 వేలు.. రేవంత్ రెడ్డి..
రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడే మన గౌరవం పెరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు... రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ నీళ్లు ఇచ్చింది నిజమే అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పాడావు పడిందని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఆనాడు ఎంపీగా గెలిపించినా... ఈ ప్రాంతానికి చేసిందేం లేదన్నారు.
కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడని విమర్శించాడు. ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని.. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు అయ్యారని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు. ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10వేలేనని.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15వేలు వేస్తుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు,బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. దళితబంధఉ, బీసీ బంధు వచ్చే వరకు పోరాటం బీఆర్ఎస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లేని చెప్పారు.
పేదోడికి ప్రగతిభవన్లోకి ప్రవేశం లేదు.. నాడు గద్దరన్నను కూడా లోపలి రానీకుండా ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారని రేవంత్ గుర్తు చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు లోపల అతిథి మర్యాదలు.. మనం మాత్రం ఎండలో మగ్గిపోవాలా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో నియామకాలు అనేవి కేసీఆర్కుటుంబానికే పరిమితమయ్యాయని విమర్శించారు. మనవడిని మంత్రిని చేసేందుకు కేసీఆర్ మూడోసారి అవ్వాలని కలలు కంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications