మోడీ.. ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు?..మోడీ కాపలాకుక్క కేసీఆర్ ఫ్లెక్సీల చిల్లరపంచాయితీ దేనికి?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అవమానించి నరేంద్ర మోడీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Recommended Video

    హైదరాబాద్ లో మోదీ బస... నోవెటెల్ వద్ద పరిస్థితి ఇదీ *Telangana | Telugu Oneindia
    మోడీ రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలి: రేవంత్ రెడ్డి

    మోడీ రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలి: రేవంత్ రెడ్డి

    పార్లమెంట్ వేదికగా తల్లిని చంపి పిల్లను ఇచ్చారంటూ దుర్మార్గంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణ రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి కూడా ప్రధాని మోడీకి ఇష్టం లేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కార్ అడుగడుగునా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

    విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ

    విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ

    విభజన హామీలను నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఎన్టీపీసీలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఐటీఐఆర్ వంటి చట్టబద్ధమైన హామీలను నెరవేర్చడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బిజెపి ఎక్కడ రైతుల ఆదాయం రెట్టింపు చేసింది చూపించాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ చేస్తామని, పేదల ఖాతాలో పదిహేను లక్షల రూపాయల నగదు జమ చేస్తామని చెప్పిన బీజేపీ హామీలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

    ఎనిమిదేళ్ళలో తెలంగాణాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు

    ఎనిమిదేళ్ళలో తెలంగాణాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు


    ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా, తెలంగాణ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తామని తెలంగాణాకు వస్తున్నారని బిజెపి నేతలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎక్కడైనా అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారని, కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు ఎంచుకుంది అన్నది ప్రజలకు అర్థం కావడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ నుండి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదని విమర్శలు గుప్పించారు. నిధుల కేటాయింపులో కానీ మంత్రి పదవిలో కానీ దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

    మోడీకి కాపలా కుక్కగా ఉంటూ ఇప్పుడు ఫ్లెక్సీల పేరుతో చిల్లర పంచాయితీ దేనికో.. కేసీఆర్ కు రేవంత్ చురకలు

    మోడీకి కాపలా కుక్కగా ఉంటూ ఇప్పుడు ఫ్లెక్సీల పేరుతో చిల్లర పంచాయితీ దేనికో.. కేసీఆర్ కు రేవంత్ చురకలు

    బండి సంజయ్ ను, కిషన్ రెడ్డి ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి విభజన చట్టంలోని అంశాలపై చర్చ పెట్టాలని, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా మోడీకి కాపలా కుక్కగా ఉంటూ ఇప్పుడు ఫ్లెక్సీల పేరుతో చిల్లర పంచాయితీ చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక అగ్నిపథ్ పై టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి, అగ్నిపథ్ ను టిఆర్ఎస్ నిజంగానే వ్యతిరేకిస్తే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు.

    మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరికపై రేవంత్ రెడ్డి స్పందన ఇదే

    మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరికపై రేవంత్ రెడ్డి స్పందన ఇదే


    బిజెపిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనకు మిత్రుడని, ఆయన పార్టీ మారితే తనకు చెబుతాడని అనుకుంటున్నానని వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీజేపీలో చేరినా కొంతకాలానికి మళ్లీ సొంత గూటికి తిరిగి వస్తారని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఆయన ఉండలేడని స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+