Revanth Reddy:రేవంత్ రెడ్డి అనే నేను...
Revanth Reddy:మరికొన్ని గంటల్లో తెలంగాణకు మూడవ ముఖ్యమంత్రి రాబోతున్నారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఇక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అప్పటివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీగా నాయకుడిగా ప్రమోట్ చేస్తూ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
బుధవారం మొత్తం ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ అగ్రనాయకులను కలిసి తనను సీఎంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా నిలిచింది. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక రేవంత్ ప్రమాణ స్వీకారంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం

PragathiBhavan becoming Ambedkar PrajaBhavan
— Congress for Telangana (@Congress4TS) December 7, 2023
ప్రగతిభవన్... అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుతోంది.
ప్రగతి భవన్ ముందు రోడ్ పై ఉన్న షెడ్, గ్రిల్స్ ని తొలగిస్తున్న GHMC సిబ్బంది.
GHMC staff removing the shed and grills on the road in front of Pragati Bhavan.#TelanganaCM #RevanthReddy… pic.twitter.com/GtwQxc9h2u













Click it and Unblock the Notifications