ప్రచారంలో రేవంత్ దూకుడు - పంచ్ డైలాగ్స్, మాటలు తూటాల్లా..!!

తెలంగాణ ఎన్నికల్లో అసలు ఘట్టం మొదలైంది. నామినేషన్ల కు నేటితో సమయం ముగుస్తోంది. ఇక ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కొసాగుతోంది. బీఆర్ఎస్ కోసం ముఖ్యమంత్రి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రేవంత్ తన ప్రసంగాల్లో బీఆర్ఎస్ పైన పంచ్ డైలాగ్స్.. మాటల తూటాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. స్పందన బాగుండటంతో పార్టీలో మరింత జోష్ కనిపిస్తోంది.

హోరా హోరీ ప్రచారం : తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. రేవంత్ ఈ సారి ఎన్నికల్లో తన నియోజకవర్గం కొడంగల్ తో పాటుగా సీఎం కేసీఆర్ పైన కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక సమయంలోనూ రేవంత్ కీలకంగా వ్యవహరించారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఖరారుతో పాటుగా సర్దుబాట్ల విషయంలో సీట్లు రాని వారికి బుజ్జగింపు ల విషయంలోనూ రేవంత్ వ్యూహాత్మకంగా మారారు. పార్టీ అభ్యర్దుల కోసం రోజుకు మూడు నియోజకవర్గాల సభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పాలన ను టార్గెట్ చేస్తూ సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ వైఫ్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

Revanth Reddys Power-packed Campaign: BRS faces the heat of punchy dialogues

ప్రచారంలో రేవంత్ దూకుడు : నియోజకవర్గాలకు వెళ్లిన సమయంలోనే అభ్యర్దుల ప్రచార సరళి గురించి రేవంత్ ఆరా తీస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలు...స్థానికంగా ప్రభావితం చేసే అంశాల గురించి చర్చిస్తున్నారు. అభ్యర్దులకు ప్రచారంలో అవసరమైన మార్పులను సూచిస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్దుల గురించి సభల్లో మాట్లాడుతూ..తమ అభ్యర్దలు గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రతీ సభలో బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కు పెడుతూ, కాంగ్రెస్ ఆరు గారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ వ్యవహార శైలి...ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం గురించి ప్రజలకు అర్దమయ్యేలా వివరించి చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ స్థానికులతో ఎమోషనల్ ఎటాచ్ మెంట్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Revanth Reddys Power-packed Campaign: BRS faces the heat of punchy dialogues

అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా : అటు రేవంత్ పైన గతంలో ఉన్న కేసులను ప్రస్తావిస్తూ కేటీఆర్ పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా తాజాగా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి కారణమన్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడేందుకు కూడా ఆయనే కారణమని చెప్పటం ద్వారా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇక, అభ్యర్దులు సైతం రేవంత్ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని కోరుతున్నారు. రేవంత్ ప్రసంగాలతో మరింత కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్ అధినాయకత్వం సైతం తెలంగాణలో తమకు అనుకూలంగా ఉండటంతో.. ఇక్కడే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రచారానికి సమయం కేటాయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+