హైదరాబాద్ నడిబొడ్డున రూ.1,090 కోట్ల ఫ్లైఓవర్లు

హైదరాబాద్ ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీని నిర్మాణ పనులను చేపట్టనుంది. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు కూడా లభించిన నేపథ్యంలో త్వరలో శంకుస్థాపన చేయనుంది జీహెచ్ఎంసీ. ఫిబ్రవరి మొదటివారంలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది- అందుబాటులోకి వస్తే వీఐపీ జోన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తీరినట్టే అవుతుంది.

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్ట్ ఇది. భూసార పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే దీని ఉద్దేశం. నగరవ్యాప్త మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా GHMC దీని నిర్మాణాన్ని చేపడుతోంది. కేబీఆర్ పార్క్ సమీపంలో ఆరు ఫ్లైఓవర్లు, ఆరు అండర్‌పాస్‌ల నిర్మాణానికి 1,090 కోట్ల రూపాయలను ప్రభుత్వం గతంలోనే కేటాయించింది. ఈ నెట్‌వర్క్.. సిగ్నల్ ఫ్రీ కారిడార్. ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు.

Rs 1090 Crore KBR Park Flyover Approved Construction to Kick Off Next Month in Hyderabad

కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ జంక్షన్లను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్‌వైపు ప్రయాణించే వారికి, మణికొండ వరకు వెళ్లే వారికి భారీ ఊరట లభించినట్టవుతుంది. ఆరు చొప్పున వై షేప్ అండర్‌పాస్, ఫ్లైఓవర్లు నిర్మితమౌతాయి. దీనికోసం మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్లకు బదులుగా ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ పైర్‌లను ఉపయోగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

ప్యాకేజ్- 1 కింద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రీ జంక్షన్, ముగ్ధ జంక్షన్ వద్ద కీలకమైన నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో రోడ్ నంబర్ 45, యూసుఫ్‌గూడ వైపు వై షేప్ అండర్‌పాస్‌, కేబీఆర్ ఎంట్రీ గేట్ నుండి రోడ్ నంబర్ 36 వైపు 4-లేన్ల ఫ్లైఓవర్లు నిర్మితమౌతాయి. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి జంక్షన్, పంజాగుట్ట వైపుగా 2-లేన్ల అండర్‌పాస్‌, 3-లేన్ల ఫ్లైఓవర్/అండర్‌పాస్‌లను ఈ ప్యాకేజీ కింద నిర్మిస్తారు.

రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్, కేన్సర్ ఆసుపత్రి జంక్షన్ వంటి కీలక ప్రాంతాలు ప్యాకేజ్- 2 పరిధిలో వస్తాయి. ఇందులో ఫిల్మ్‌నగర్ నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు 2-లేన్ల అండర్‌పాస్‌, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి రోడ్ నంబర్ 45 వైపు ఫ్లైఓవర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నంబర్ 45, రోడ్ నంబర్ 12 వైపు అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు, కేబీఆర్ పార్క్ నుండి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు అండర్‌పాస్‌లను నిర్మిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+