యువరాజా మజాకా: వీర్యం ఖరీదే రూ. 4 లక్షలు (పిక్చర్స్)

హైదరాబాద్: దీపావళి పర్వదినం తర్వాత యాదవులు నిర్వహించే సదర్ (దున్నపోతుల ప్రదర్శన)లో యువరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాదులోని ఎల్లారెడ్డి గూడా సదర్ ప్రదర్శనలో అది పాల్గొంది. దాని ఖరీదు అక్షరాల 7 కోట్ల రూపాయలు.

మరో విశేషం కూడా ఉంది. దున్నపోతు యువరాజ్ వీర్యానికి భలే గిరాకీ ఉందట. దాని వీర్యం ఖరీదు రూ. 4 లక్షలని చెబుతున్నారు. యువరాజ్ వీర్యానికి యూరోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం దున్న వీర్యాన్ని ఎగుమతి చేస్తున్నారు.

నాలుగు రోజులకొక సారి యువరాజ్ వీర్యాన్ని సేకరించి అనంతరం నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజెక్షన్ల రూపంలో విక్రయిస్తారు. యువరాజ్ నుంచి ఒక్క సారి సేకరించిన వీర్యంపై రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది.

ఇంజక్షన్ ఖరీదు రూ. 400

ఇంజక్షన్ ఖరీదు రూ. 400

యువరాజ్ వీర్యంతో కూడిన ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ. 400. దున్న వీర్యంపై ప్రతి ఏటా రూ. కోటి వరకు ఆదాయం వస్తుంది.

ప్రత్యేక ఆకర్ణణ అదే

ప్రత్యేక ఆకర్ణణ అదే

యాదవుల సంస్కృతి, సంప్రదాయానికి చిహ్నమైన సదర్ పండుగ గురువారం ఘనంగా జరిగింది. ఈ ఏడాది సదర్ ఉత్సవాల్లో యువరాజ్ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హర్యానా నుంచి తెచ్చారు..

హర్యానా నుంచి తెచ్చారు..

హర్యానాకు చెందిన దున్న యువరాజ్‌ను ఏడు రోజులు వ్యయ ప్రయాసలకు ఓర్చి హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు. ఏడేళ్ల వయసున్న ఈ దున్న ఖరీదు రూ. 7 కోట్లు.

భలే రాజసం

భలే రాజసం

యువరాజ్ బరువు 1600 కిలోలు, 6 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవుతో చూపరులను ఆకట్టుకుంది.

వారసత్వం ఇదీ..

వారసత్వం ఇదీ..

యువరాజ్ తల్లి గంగకు 17 ఏళ్లు.. తండ్రి యోగరాజ్‌కు 18 ఏళ్లు.. తమ్ముళ్లు ధోనీ, భీంరాజ్‌లు కూడా ఉన్నారు. దీని యజమాని కరమ్‌వీర్ సింగ్.

ఎగబడ్డారు...

ఎగబడ్డారు...

దీపావళి తర్వాత నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో భాగంగా యువరాజ్‌తో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు.

ఇదీ ఆహారం..

ఇదీ ఆహారం..

యజమాని కరంవీర్ సింగ్ దానికి రోజుకు 100 ఆపిల్స్, 25 లీటర్ల పాలు, ఐదేసి కిలోల చొప్పు మూడు రకాల పంటలు, పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ పెడుతాడు.

మసాజ్ ఆయిల్‌తో..

మసాజ్ ఆయిల్‌తో..

ప్రతి రోజూ రెండు సార్లు యువరాజ్‌కు మస్టర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తారు. ప్రతి రోజు పరుగుకు తీసుకుని వెళ్తారు. నెలకు నాలుగు సార్లు వెంట్రుకలు కత్తిరిస్తారు.

అతను తెచ్చాడు...

అతను తెచ్చాడు...

సదర్ ఉత్సవాల కోసం యాదవ మహాసభకు చెందిన ఎడ్ల హరిబాబు యువరాజ్ హైదరాబాదుకు తీసుకుని వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+