సోమాజిగూడలో పట్టుబడ్డ 12లక్షల కొత్త నోట్లు: ఇద్దరు అరెస్టు..
సోమాజిగూడ పెట్రోలు బంకు వద్ద నవీన్ అనే వ్యక్తి నుంచి శుక్రవారం నాడు 12లక్షలు భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పంజాగుట్ట: ఓవైపు కొత్త నోట్లు దొరక్క సామాన్యులంతా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంటే.. బడాబాబులకు మాత్రం కోట్ల కొద్ది కొత్త కరెన్సీ వాళ్ల కాళ్ల వద్దకే వచ్చి చేరుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్ లోని పంజాగుట్టలో రూ.12లక్షల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోమాజిగూడ పెట్రోలు బంకు వద్ద నవీన్ అనే వ్యక్తి నుంచి శుక్రవారం నాడు ఈ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కొత్త నోట్లన్ని నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన వ్యాపారులు మహేష్, వెంకన్నలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. పాత నోట్లను మార్చుకోవడం కోసం వ్యాపారులను సంప్రదించిన నవీన్.. వారిని బెదిరించి కొత్త నోట్లు తీసుకున్నాడు.

అనంతరం తన వద్ద ఉన్న పాత నోట్లు అరగంటలో తీసుకువస్తానని చెప్పి అక్కడినుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో నవీన్ కోసం వేట ప్రారంభించిన పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన ఏసీబీలో హోంగార్డుగా పనిచేస్తున్న నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో వ్యాపారుల వద్దకు కొత్త నోట్లు ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications