వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ ఉద్యోగుల పదవివిరమణ వయస్సు 60 సంవత్సరాలు

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురును అందించారు. ఆర్టీసీ ప్రక్షాళనలో భాగంగా పలు చర్యలు చేపడుతున్న సీఎం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ నిబంధన ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగికి వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

ఆర్టీసీ సంక్షేమంపై సత్వర నిర్ణయాలు

ఆర్టీసీ సంక్షేమంపై సత్వర నిర్ణయాలు

ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకుండా చర్యలు చేపట్టిన సీఎం కేసీఆర్ ఉద్యోగులకు కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చుతున్నారు. ముఖ్యంగా సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులతో నేరుగా సమావేశం అయిన సీఎం కేసీఆర్ వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సమస్యలకు కార్మిక సంఘాల కారణమని పలుసార్లు చెప్పిన సీఎం వారి అవసరం లేకుండా ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువచ్చి కార్మికుల సంక్షేమానికి పలు హామీలు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఆర్టీసీ సంక్షేమంపై నిర్ణయాలు తీసుకుంటున్నారు..

ఆర్టీసీలో సంస్కరణలు

ఆర్టీసీలో సంస్కరణలు

ఆర్టీసీ అభివృద్దిపై స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ వారికి సంబధించిన అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పరిగణించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మహిళలకు రాత్రి ఎనిమిది తర్వాత డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఉద్యోగుల డ్రెస్ కోడ్‌ను కూడ మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా వారికోసం ప్రతి డిపో పరిధిలో సంక్షేమ అధికారులను పెట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నెల రోజుల్లోనే ఉద్యోగాలు

నెల రోజుల్లోనే ఉద్యోగాలు

మరోవైపు ఆర్టీసీ సమ్మెలో భాగంగా ముప్పైమందికి పైగా కార్మికులు మృతిచెందారు. వారికి ప్రభుత్వంలోని గాని, ఆర్టీసీలోని ఉద్యోగాలు ఇస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నెల రోజుల పూర్తికాకముందే కార్మికుల కుటుంబాల్లోని అర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఆర్టీసీ సంస్కరణలో భాగంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మరో పదిహేను రోజుల్లో కార్గో సర్వీసులను తిప్పనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు ప్రకటించారు.

English summary
RTC employees retirement age at 60. telangana government have been issued a G.O. and it will be affected every employee in rtc says officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X