Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TGSRTC: అవన్నీ ఫేక్.. తేల్చి చెప్పిన టీజీఎస్ఆర్టీసీ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రావాణసంస్థ(TGSRTC)లో 3035 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు కొన్ని లింక్ లు పెడుతున్నారు. వీటిని క్లిక్ చేసి నిరుద్యోగులు మోసపోతున్నారు. దీంతో దీనిపై ఆర్టీసీ స్పందించింది. తాము ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని తేల్చిచెప్పింది.

ఇందుకు సంబంధించి ఎక్స్ లో ట్వీట్ చేసింది. "రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును #TGSRTC ప్రారంభించింది. 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దని TGSRTC యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది" అని పోస్ట్ చేసింది.

RTC has asked you to click on the links related to RTC recruitment on social media

కాగా 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్‌ పోస్టులు ఉండగా.. 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌), 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌, 11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ 3035 పోస్టులను భర్తీకి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనేది స్పష్టత లేదు. కావున నిరుద్యోగులు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చిన లింక్ లను క్లిక్ చేసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి సమాచారమున్న మీడియా ద్వారా తెలియజేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+