''రాజకీయాల్లోకి ఎందుకొచ్చాననే బాధ, హిమాన్ష్‌ లావుగా, కెసిఆర్ ఆరోగ్యంగానే''....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిఫల్ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. విపక్షాలు ఒక్కో సమయంలో చేసే విమర్శల పట్ల కెటిఆర్ ఈ రకంగా అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ బుదవారం నాడు పలు విషయాలపై మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.

అంతేకాదు నేరేళ్ళ ఘటనపై ప్రత్యేకించి ఆయన మాట్లాడారు. నేరేళ్ళ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. నేరేళ్ళ ఘటనలో పోలీసులు ఆ రకంగా వ్యవహరించాల్సి ఉండాల్సింది కాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తనపై విపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవమే లేదన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఏ రకంగా ఉండేదో, ప్రస్తుతం ఎలా ఉండేదో అనే విషయాలను ఆయన మీడియా ప్రతినిధుల వద్ద ప్రస్తావించారు.

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని బాధేస్తోంది

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని బాధేస్తోంది

తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి కెటిఆర్ హైద్రాబాద్‌కు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీచేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కెటిఆర్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. అయితే ప్రభుత్వంలో నెంబర్ టూ వ్యవహరిస్తున్నారు. అయితే అదే సమయంలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల పట్ల బాధేస్తోందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో విమర్శలు , ప్రతి విమర్శలు చేయడం సాధారణమే. కానీ, కొన్ని సమయాల్లో విపక్షాలు చేసే విమర్శలను చూస్తే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాననే అనుమానం కూడ వస్తోందన్నారు.

KTR visits Dalits And His Strategy On Nerella Dalit Incident
లావుగా ఉన్నాడని హిమాన్ష్‌ను తిట్టడం సరైందికాదు

లావుగా ఉన్నాడని హిమాన్ష్‌ను తిట్టడం సరైందికాదు

లావుగా ఉన్నాడని నా కొడుకు హిమాన్ష్‌ను తిట్టడం సరైంది కాదన్నారు. కొందరు విమర్శల పేరుతో అతిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్న నేతలు మరింత పరిణితితో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారాయన.

కెసిఆర్, హరీష్‌రావు ఆరోగ్యంగానే

కెసిఆర్, హరీష్‌రావు ఆరోగ్యంగానే

ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడ చాలా ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి కెటిఆర్ చెప్పారు. వారి ఆరోగ్యాలకు ఎలాంటి ఢోకా లేదన్నారు. తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయని , ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు కెటిఆర్. హరీష్‌రావు పార్టీ పనులపై, అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు క్షణం తీరిక లేకుండా ఉంటారని కెటిఆర్ చెప్పారు. ఆదివారమైనా సెలవు తీసుకోవాలని హరీష్‌ను కోరినట్టు చెప్పారు. అయితే నియోజకవర్గంలో ఎక్కువగా గడిపేది హరీష్‌రావేనని ఆయన చెప్పారు.

2011 హిమాన్ష్ మోటార్స్ కార్యకలాపాలు మూసివేత

2011 హిమాన్ష్ మోటార్స్ కార్యకలాపాలు మూసివేత

2011లోనే హిమాన్ష్ మోటార్స్ కార్యకలాపాలు బంద్ అయ్యాయని చెప్పారు కెటిఆర్. సాంకేతికంగా హిమాన్ష్ మోటార్స్‌ను మాత్రం మూసివేయలేదని చెప్పారు. హిమాన్ష్ మోటార్స్ అనేది ట్రాక్టర్స్ కొనుగోలు కంపెనీ అని కెటిఆర్ చెప్పారు. ఈ కంపెనీకి ఇన్నోవా కార్లు, బైక్‌లకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.

కోర్టులు చెబితే మేం ఏం చేస్తాం

కోర్టులు చెబితే మేం ఏం చేస్తాం

కాంట్రాక్టు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ విషయంలో కోర్టుల ఆదేశాలను పాటించక తప్పదన్నారు కెటిఆర్. కోర్టులు క్రమబద్దీకరించకూడదని ఆదేశిస్తే ఏం చేయాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు 50 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rumours spreading on kcr's health is false .No facts on opposition parties allegations on me said Telangana IT minister KTR on Wednesday. KTR chit chat with media .
Please Wait while comments are loading...