రైతు భరోసా నిధులు జమ, ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో బలం చాటేందుకు సిద్దమైంది. కాగా, ఇదే సమయం లో రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. రైతులు నిరీక్షిస్తున్నారు. కాగా.. తాజాగా రైతు భరోసా నిధుల విడుదల పైన ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అందుతోంది.
రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన స్పష్టత వచ్చింది. సంక్రాంతి సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తొలుత భావించారు. అయితే, అమలు కాలేదు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల పైన తుది కసరత్తు చేస్తున్నారు.

రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం దాదాపు ఫిక్స్ చేసారు. విడత ల వారీగా నిధుల చెల్లింపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, తాజా కసరత్తు వేళ రైతు భరోసా అమలు.. అర్హత పైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పథకం అందుకుంటున్న లబ్దిదారుల్లో తాజా అర్హతల మేర కోత విధించారు. ఈ నెల మూడో వారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రైతు భరోసా విడుదల మార్గదర్శకాలు
పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తోంది. దీనికి సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది. దీంతో.. రైతు భరోసా నిధులు సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర రైతు కమిషన్ సైతం వ్యవసాయ శాఖ అధికారులతో చర్చలు చేసింది.
జనవరి నెలాఖరులోనే విడుదల దిశగా కసరత్తు జరిగింది. అయితే, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా నిర్ణయం వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఈ నెల 11న పోలింగ్ పూర్తి కానుంది. దీంతో.. ఈ నెల మూడో వారంలో తాజాగా ఖరారు చేసిన అర్హుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయనున్నారు. పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications