తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 4 ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారికి..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ తో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ.. తదితర అనేక సంక్షేమ పథకాలతో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఇక తెలంగాణలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేపట్టాలని భావిస్తోంది.ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. అయితే తెలంగాణలోని రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్.

త్వరలోనే రైతు భరోసా పథకం కింద నగదును అన్నదాతల అకౌంట్లలో వేసేందుకు సమాయత్తం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని త్వరలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకూ కేవలం 3.5 ఎకరాలు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించారు. అయితే తాజాగా 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని తుమ్మల కీలక ప్రకటన చేశారు. అయితే తొలుత ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఎకరానికి రూ.6,000 చొప్పున అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల స్పష్టం చేశారు.

Rythu Bharosa Scheme Extended to Telangana Farmers Owning 4 Acres or More

మరోవైపు ఇటీవల భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. అయితే తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా.. పారదర్శకంగా పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని.. త్వరలోనే రాష్ట్రంలో ఆయిల్ పామ్ మిల్లును ఏర్పాటు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+