Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ కాంగ్రెస్‌లో షేకప్- ఢిల్లీ స్థాయిలో: తెరపై డైనమిక్ లీడర్

Sachin Pilot: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయా?.. కొత్త నియామకాలు తెర మీదికి రాబోతోన్నాయా? ఇవి- ఢిల్లీ స్థాయిలో ఉండబోతోన్నాయా?.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మార్పులు- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ స్థాయిలో ఉంటాయనీ తెలుస్తోంది.

ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి తెలంగాణ రాష్ట్ర అదనపు వ్యవహారాల ఇన్‌ఛార్జీగా దీపా దాస్ మున్షీ పని చేస్తోన్నారు. 2023 డిసెంబర్‌లో అప్పటి ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఇవి- ఆమెకు అదనపు బాధ్యతలు. కేరళతో పాటు లక్షద్వీప్ టెరిటోరియల్ కాంగ్రెస్ కమిటీకి ఆమె పూర్తిస్థాయి ఇన్‌ఛార్జీగా ఉంటోన్నారు.

Sachin Pilot likely to appoint as Telangana Congress Incharge

ఇప్పుడు ఆమెను ఈ అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీపా దాస్ మున్షి స్థానంలో రాజస్థాన్‌కు చెందిన యువ నేత సచిన్ పైలెట్‌ను పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా నియమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవలే సచిన్ పైలెట్ తెలంగాణ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. బాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మర్యాదపూరకంగా రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు రేవంత్.

సచిన్ పైలెట్ తెలంగాణ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. అబ్దుల్లాపూర్ మెట్‌లో శ్రీదేవ్ నారాయణ్ ఆలయంలో మూల విరాట్టు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అందులో పాల్గొన్న అనంతరం మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. ఈ పర్యటన అనంతరం సచిన్ పైలెట్‌కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా నియమిస్తారనే ప్రచారం మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+