హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ రూట్లలో అస్సలు వెళ్లొద్దు..!
హైదరాబాద్ లో సదర్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. నారాయణగూడ లోని YMCA ప్రాంతంలో సదర్ ఉత్సవ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులను పోలీసులు విధించారు. నారాయణగూడలోని YMCA వద్ద సదర్ ఉత్సవం అక్టోబర్ 22 సాయంత్రం 7 గంటల నుంచి అక్టోబర్ 23 తెల్లవారుజామున 4 గంటల వరకు ఉంటుంది. దీంతో ఆ రూట్లలో రాకపోకలను దారి మళ్లించనున్నారు పోలీసులు. ఈ వివరాలను హైదరాబాద్ సిటీ పోలీస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
రామ్ కోటి, లింగంపల్లి క్రాస్ రోడ్స్ నుంచి YMCA, నారాయణ గూడ వైపునకు వచ్చే ట్రాఫిక్ ను కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద టూరిస్ట్, సుల్తాన్ బజార్ వద్ద దారి మళ్లించనున్నారు. అలాగే విట్టల్ వాడి క్రాస్ రోడ్స్ నుంచి రాజ్ మోహల్లా వైపునకు వచ్చే ట్రాఫిక్ ను పద్మశాలి భవన్ వద్ద ట్రాఫిక్ మల్లించి రామ్ కోటి క్రాస్ రోడ్స్ వైపునకు మళ్లించనున్నారు.
TRAFFIC ADVISORY
— Hyderabad City Police (@hydcitypolice) October 21, 2025
In view of the Sadar Utsav Mela which will be celebrated at YMCA, Narayanaguda from 7 PM on 22.10.2025 to 4 AM on 23.10.2025, the movement of vehicular traffic will be diverted at the following places and routes.
1.Traffic coming from Ramkoti and Lingampalli X… pic.twitter.com/x0Zm6OzQq1
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, సిమెటరీ నుంచి వచ్చే ట్రాఫిక్ ను విట్టల్ వాడీ క్రాస్ రోడ్స్ వద్ద దారి మళ్లించి రామ్ కోటి క్రాస్ రోడ్స్ వైపునకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, క్రౌన్ కేఫే నుంచి వచ్చే ట్రాఫిక్ ను నారాయణ గూడ క్రాస్ రోడ్స్ వద్ద దారి మళ్లించి హిమాయత్ నగర్ వై జంక్షన్ వైపు మళ్లించనున్నారు. నారాయణ గూడ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను బాబా టెంట్ హౌజ్ వద్ద దారి మళ్లించి క్రౌన్ కేఫే వైపు మళ్లించనున్నారు. అలాగే బర్కత్ పురా నుంచి వచ్చే వాహనాలను పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద దారి మళ్లించనున్నారు.

అలాగే సదర్ మేళాకు వచ్చే ప్రజలు తమ వాహనాలను కేశవ్ మెమోరియల్ కాలేజీ గ్రౌండ్స్ వద్ద పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పార్కింగ్ కెపాసిటీ 400 టూ వీలర్స్ కు అలాగే 400 ఫోర్ వీలర్స్ కు సదుపాయం ఉన్నట్లు తెలిపారు. ట్రాఫిక్ అప్డేట్స్ కోసం.. ఇతర సమాచారం కోసం 9010203626 నెంబర్ కు సంప్రదించాలని సూచనలు చేశారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications