మెగా కాంపౌండ్ హీరో సినిమాకు తెలంగాణ నార్కొటిక్స్ వార్నింగ్

Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం.. గాంజా శంకర్. సంపత్ నంది దర్శకుడు. ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కింద నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. భీమ్స్ సిసిలియో ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తోన్నారు.

ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. గాంజా శంకర్ అనే టైటిల్ పట్ల తెలంగాణ నార్కొటిక్స్ బ్యురో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించేలా టైటిల్ ఉందని స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూనిట్‌కు నోటీసులను జారీ చేశారు.

Sai Dharam Tejs Gaanja Shankar movies received notices from Telangana Narcotics Bureau

ఈ మేరకు తెలంగాణ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య నోటీసులను జారీ చేశారు. సినిమా టైటిల్, అందులో హీరో పోషించే పాత్ర తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరోను గంజాయి అమ్మే వ్యాపారిగా చూపించడం, గాంజా అమ్మకాలను ప్రోత్సహించేలా పాత్ర చిత్రీకరణ ఉండటం సరికాదని చెప్పారు.

నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ చట్టాన్ని ఇది ఉల్లంఘించినట్టవుతుందని అన్నారు. మాదక ద్రవ్యాలు లేదా గంజాయిని సేవించడం, వాటి అమ్మకాలు, అక్రమ రవాణాను ప్రోత్సహించేలా సన్నివేశాలను చిత్రీకరించబోరని ఆశిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ పెడ్లర్స్‌ను హీరోలుగా కీర్తించడం వంటి డైలాగులు గానీ సన్నివేశాలు గానీ ఉండబోవని ఆశిస్తున్నట్లు చెప్పారు. చట్ట ప్రకారం వివాదాస్పదమైన అంశాలను స్ప‌శించడం సరికాదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+